India Corona: దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. ఆ రాష్ట్రంలో మాత్రం విజృంభిస్తోంది..!

India Corona: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 45,352 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..

India Corona: దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. ఆ రాష్ట్రంలో మాత్రం విజృంభిస్తోంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2021 | 11:23 AM

India Corona: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 45,352 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 366 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,39,895కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇక నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 34,791 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనాను జయించిన వారు 3.20 కోట్ల మంది ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది.

ప్రస్తుతం దేశంలో 3,99,778 మంది వైరస్‌తో బాధపడుతుండగా, క్రియాశీల రేటు 1.22శాతానికి పెరిగింది. ఇక దక్షణాది రాష్ట్రం కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో రెండొంతులు ఒక్క ఆ రాష్ట్రంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం అక్కడ 32,097 పాజిటివ్‌ కేసులు, 188 మంది మృతి చెందడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 74.84 లక్షల మందికివ వ్యాక్సిన్‌ వేయగా, ఇప్పటి వరకు దేశంలో67.09 కోట్ల వ్యాక్సిన్‌లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, ఇటీవల దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొత్త రకం కరోనా వేరియంట్‌ను గుర్తించారు. సీ.1.2గా పిలిచే ఈ రకం సింగిల్​ వైరస్​ కాదు.. జన్యుక్రమాలు సారూప్యంగా ఉన్న వైరస్‌ల సమూహం. అయితే ఈ కొత్త రకం వేరియంట్​పై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు. కానీ.. వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి మ్యుటేషన్​ రేటు ఎక్కువే అని వెల్లడించారు. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మ్యుటేషన్లు బయటపడుతున్నాయని అర్థమవుతుంది. వాస్తవానికి వైరస్‌ల స్వభావం అదే. నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాయి. మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. అయితే.. సీ.1.2 ను ఇతర వేరియంట్లతో పోల్చి చూడటం తొందరపాటే అవుతుందని పరిశోధకులు అంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Covid In AP Schools: ఏపీ స్కూల్స్‌లో కరోనా వైరస్ కలకలం.. తాజాగా కృష్ణ జిల్లాలో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Egg: రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు గుడ్డును ఏ రూపంలో తీసుకోవాలి..? గుడ్డును పచ్చిగా తీసుకోవడం మంచిదేనా?

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ