Egg: రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు గుడ్డును ఏ రూపంలో తీసుకోవాలి..? గుడ్డును పచ్చిగా తీసుకోవడం మంచిదేనా?

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 01, 2021 | 1:48 PM

Eggs Health Benefits: అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు(Egg). అందుకే గుడ్డును ఆరోగ్యానికి మంచిందని అందరికి తెలిసిందే. ఆరోగ్యం..

Egg: రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు గుడ్డును ఏ రూపంలో తీసుకోవాలి..? గుడ్డును పచ్చిగా తీసుకోవడం మంచిదేనా?

Eggs Health Benefits: అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు(Egg). అందుకే గుడ్డును ఆరోగ్యానికి మంచిందని అందరికి తెలిసిందే. ఆరోగ్యం కోసం రోజుకొక గుడ్డును తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. అయితే కొంతమంది గుడ్డుని ఉడక బెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. ఇలా రకరకాలుగా తింటుంటారు. అయితే పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో వస్తుంటుంది.

కోడి గుడ్డుని పచ్చిగా పగల కొట్టుకుని తాగవచ్చు. అయితే అలా చేసే వాళ్లు ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. మామాలుగా అయితే కోడిగుడ్డుని ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ, చాలా మంది మాత్రం పచ్చిగానే పగలకొట్టి తాగుతున్నారు. పచ్చిగా తాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. కోడిగుడ్డుతో ఈ బ్యాక్టీరియా స్వల్ప మోతాదులో ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎటువంటి హాని కలగదు. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్‌ఫెక్షన్లు, జ్వరం వస్తాయి. పచ్చి గుడ్డులోని తెల్లటి భాగంలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉన్నవాళ్లకే..

అలాగే ఆరోగ్యంగా లేని వ్యక్తులు కూడా పచ్చి కోడి గుడ్డుని రోజూ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఏమైనా వ్యాధులున్న వారు పచ్చి కోడి గుడ్డుని రెగ్యులర్ గా తీసుకుంటే బయోటిన్ అనే పోషక లోపం ఏర్పడుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయోటిన్ లోపాన్ని విటమిన్ బి 7 అని కూడా అంటారు. ఈ లోపం ఏర్పడితే.. చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి.

తెల్లసోనతో అలర్జీ..

కొంతమందికి పచ్చి గుడ్డులోని తెల్లసొన అలర్జీని కలిగించే అవకాశం ఉంది. శరీరంలో దద్దుర్లు, వాపు, చర్మం ఎర్రబడటం, తిమ్మిరి, విరేచనాలు, దురద, కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు గుడ్డులోని తెల్లసొన కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. బీపీలో హెచ్చితగ్గులు ఏర్పడతాయి.

గుడ్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

గుడ్డులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (లినోలెయిక్, ఒలేయిక్ ఆమ్లం) గుడ్లు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్లు ఎ, బి 6, బి 12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, భాస్వరం , సెలీనియంలో లభిస్తాయి. ఉడికించిన గుడ్లు ప్రోటీన్, ఇతర పోషకాలకు మంచి మూలం చెప్పవచ్చు.

గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు వల్ల జీర్ణ సమస్య దూరం అవుతుంది. ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

ఇవీ కూడా చదవండి:

Salt: కొత్త రకం ఉప్పుతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడవచ్చు.. పరిశోధనల ద్వారా తేల్చిన శస్త్రవేత్తలు

Brazilian Viper Venom: ప్రాణాలు తీసే పాము విషంతోనే కరోనాకు మందు.. ప్రయోగాల ద్వారా తేల్చిన పరిశోధకులు

Snoring: నిద్ర‌లో గుర‌క ఎందుకు వ‌స్తుంది..? ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu