Snoring: నిద్ర‌లో గుర‌క ఎందుకు వ‌స్తుంది..? ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Snoring Natural Tips: నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులకు..

Snoring: నిద్ర‌లో గుర‌క ఎందుకు వ‌స్తుంది..? ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
Follow us

|

Updated on: Aug 29, 2021 | 3:49 PM

Snoring Tips: నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఎదుటి వారికి నిద్రపట్టదు. నిద్రపోయేవారు గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు వైద్య నిపుణులు. గురక రావడానికి ప్రధాన కారణాలు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గుర‌క ఎందుకు వ‌స్తుంది..?

నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు ఉన్నాయి. ఇక ప్ర‌ధాన కార‌ణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి.

నోటి ద్వారా శ్వాస:

సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే కార‌ణం

మధ్య వయసు, ఆపై వయసుకు వచ్చిన తర్వాత గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. అధిక బరువు ఉండడం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది. మద్యం, పొగతాగడం, ట్రాంక్విలైజర్ ఔషధాలైన లోరజ్ పామ్, డైజిపామ్ కండరాలకు పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి. దానివల్ల కూడా గురక రావచ్చు. ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే.

గుర‌క స‌మ‌స్య‌ను అధికమించ‌డానికి చిట్కాలు..

► ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.

► అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

► ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

►కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

► ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.

► రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌.

ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల గురకను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చ‌ద‌వండి:

Health Tips: మీరు ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!

Prawn Egg Omelette: నాన్‌వెజ్ ప్రియులు రొటీన్ టిఫిన్స్‌తో విసిగిపోయారా.. అయితే వెరైటీగా రొయ్యల ఆమ్లెట్ ట్రై చేయండి