Narsampet: పసికందుకు కాలం చెల్లిన సెలైన్ ఎక్కించిన డాక్టర్.. నర్సంపేటలో నిర్వాకం
వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకొచ్చింది. ఎనిమిది రోజుల బాబుకు జాండిస్ వచ్చాయని
Expired saline – Narsampeta: వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకొచ్చింది. ఎనిమిది రోజుల బాబుకు జాండిస్ వచ్చాయని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. పరీక్షించి ఫోటో తెరఫి బాక్సులో ఉంచి సెలైన్ పెట్టమని వైద్యుడు జాన్సన్ సిబ్బందికి చెప్పాడు. తీరా తల్లిదండ్రులు చూసే సరికి ఎక్స్ పైరీ అయిపోయిన సెలిన్ బాటిల్‌ను బాబుకు ఎక్కించారు. నర్సంపేట పట్టణంలోని తనూష పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘటన ఇది.
నర్సంపేట డివిజన్‌లో మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో తనిఖీలు చేయాల్సిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు జాడలేరు. దీంతో హాస్పిటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన మందులు అమ్ముతున్నా పట్టించుకున్న నాధుడే లేడని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయాలని, కాలం చెల్లిన సెలెయిన్ పెట్టిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
నర్సంపేట పట్టణంలో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు ఇంలాటి ఘటనలు జరిగాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని ఓ ఆసుపత్రిలో శిశువు చనిపోయింది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అసలు తనిఖీలు జరిగిన దాఖలాల్లేవని చెబుతున్నారు.