Health Tips: మీరు ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!

Health Tips: ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కొన్నింటిని పాటిస్తే రోజంతా హుషారుగా ఉండవచ్చు. కానీ చాలా మంది ఉదయం నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ ముట్టనిదే ఉండరు..

Health Tips: మీరు ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Sep 25, 2022 | 9:00 AM

Health Tips: ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కొన్నింటిని పాటిస్తే రోజంతా హుషారుగా ఉండవచ్చు. కానీ చాలా మంది ఉదయం నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ ముట్టనిదే ఉండరు. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి ఏం మెసేజ్‌లు వచ్చాయి.. ఫేస్‌బుక్‌లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి చూసుకుంటుంటారు. ఆ తర్వాత యథావిధిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. అందుకే ఉదయం నిద్రలేవగానే వాటి జోలికి వెళ్లకూడదంటున్నారు.

నిద్రలేవగానే 20 సెకన్ల పాటు అద్దంలో మీ ముఖాన్ని చూసుకోండి:

నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్‌ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌మార్నింగ్‌ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.

నిద్రలేవగానే నిమ్మకాయ నీళ్లు..

రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోయి శరీరం శుద్ది అవుతుంది.

పండ్లతో హుషారు..

అలాగే ఉదయం పూట పండ్లను తింటే ఎంతో మేలంటున్నారు. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్‌, ప్రోటీన్స్‌ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా పండ్లను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచుతాయి.

త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిది..

చాలా మంది ఉదయం చాలా ఆలస్యంగా లేచే అలవాటు ఉంటుంది. ఉదయం త్వరగా లేచే అలవాటు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

నిద్ర లేచిన తర్వాత వ్యాయమం..

నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం మీ అలవాట్లలో లేకపోయినట్లయితే ఆ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవగానే ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.