India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. కొత్తగా నమోదైనవి ఎన్నంటే.!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 70 రోజుల్లో కొత్తగా...

  • Publish Date - 10:22 am, Sat, 12 June 21
India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. కొత్తగా నమోదైనవి ఎన్నంటే.!
India Corona Updates

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 70 రోజుల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం.దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. ఇందులో 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 1,21,311 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,79,11,384కి చేరింది.

అటు నిన్న 4002 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,67,081కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 24.96 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతంగా ఉందని.. పాజిటివిటీ రేట్ 4.94 శాతంగా ఉందని తెలిపింది.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..