దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మరోసారి పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు, 460 మరణాలు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి నుంచి మరో 33,964 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 3,28,10,845 కాగా, ఇందులో యాక్టివ్ కేసులు 3,78,181, కోలుకున్నవారి సంఖ్య 3,19,93,644గా ఉంది. అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 4,39,020 మంది మరణించారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కేరళలో 30,203 పాజిటివ్ కేసులు, 115 మరణాలు సంభవించాయి. అటు మహారాష్ట్రలో 4196 పాజిటివ్ కేసులు, 104 మరణాలు వెలుగు చూశాయి.
మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది. అంతకు ముందు రోజు 59,62,286 మందికి టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థర్డ్ వేవ్ రావచ్చని వైద్య నిపుణులు చెబుతుండటం.. అలాగే అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరుతుందని అనడంతో కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రాలన్నీంటికి మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
India reports 41,965 new #COVID19 cases, 33,964 recoveries & 460 deaths in last 24 hours, as per Health Ministry.
Total cases: 3,28,10,845 Active cases: 3,78,181 Total recoveries: 3,19,93,644 Death toll: 4,39,020
Total vaccination: 65,41,13,508 (1,33,18,718 in last 24 hours) pic.twitter.com/aTNSwzEBhd
— ANI (@ANI) September 1, 2021
ఇవి చదవండి:
మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. పేరేమో సూపర్.. సోషల్ మీడియాలో వైరల్!