Gujarat Elections: సుప్రీం ఆదేశాలు బేఖాతరు.. అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవారే ఎక్కువ.. ఆప్ నుంచే అత్యధికం..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు సమయం దగ్గరపడుతోంది. విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు..

Gujarat Elections: సుప్రీం ఆదేశాలు బేఖాతరు.. అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవారే ఎక్కువ.. ఆప్ నుంచే అత్యధికం..
Supreme Court
Follow us

|

Updated on: Nov 25, 2022 | 6:28 AM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు సమయం దగ్గరపడుతోంది. విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా గుజరాత్ లో అధికారంలోకి రావాలని ఆప్ ప్లాన్స్ చేస్తోంది. అధికారం కోసం కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. అయితే డిసెంబరు 1న జరగనున్న తొలి విడత పోలింగ్‌కు గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నవారేనని ఓ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు అసోసియేషన్‌ ఆప్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ వివరాలు తెలిపింది. ఆమ్ ఆద్మి పార్టీలోనే నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య అత్యధికంగా ఉందని పేర్కొంది. బీజేపీ అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవారి సంఖ్య తగ్గినట్లు తెలిపింది. కాంగ్రెస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ లేదని వివరించింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై గతంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నేరచరిత్ర కలిగిన వారిని ఏ పార్టీలూ అభ్యర్థులుగా ప్రకటించకూడదు. ఒక వేళ ప్రకటిస్తే నేర చరిత్ర లేని అభ్యర్థులను కాదని ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కారణాలు వెల్లడించాలని 2020 ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఏ రాజకీయ పార్టీ కూడా పాటించలేదని తెలుస్తోంది. గుజరాత్‌ తొలి విడత ఎన్నికల్లో ఒక్కో పార్టీ 16శాతం నుంచి 36 శాతం వరకు నేరచరిత్ర కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేసిందని ఏడీఆర్‌ ఛైర్మన్‌ రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ అనిల్‌ వర్మ తెలిపారు.

మరోవైపు.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రచార ప‌ర్వం వేడెక్కింది. పార్టీల మ‌ధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేర‌ింది. త‌మ‌కు రాజ‌కీయాలు చేత‌ కాద‌ని, ప్రజ‌ల కోసం ప‌ని చేయ‌డ‌మే త‌మ‌కు తెలుస‌ని ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుద‌న్ గ‌ధ్వి వెల్లడించారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో రైతుల స‌మ‌స్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అభివృద్ధి రాజ‌కీయాలు, ఉద్యోగుల అవుట్‌సోర్సింగ్ వంటి అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయి. గుజ‌రాత్‌లో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింద‌ని ఆయన మండిప‌డ్డారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు డిసెంబ‌ర్ 1, డిసెంబ‌ర్ 5న రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!