AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: మన్‌ కీ బాత్‌లో ఆ మూడు రాష్ట్రాలపై ప్రధాని ప్రశంసలు.. మోదీ ఏమన్నారంటే.?

మన్ కీ బాత్.. ప్రతీ నెలా చివరి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో రేడియో ద్వారా ముచ్చటిస్తుంటారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు..

Mann Ki Baat: మన్‌ కీ బాత్‌లో ఆ మూడు రాష్ట్రాలపై ప్రధాని ప్రశంసలు.. మోదీ ఏమన్నారంటే.?
Narendra Modi
Ravi Kiran
|

Updated on: Apr 22, 2023 | 5:24 PM

Share

మన్ కీ బాత్.. ప్రతీ నెలా చివరి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో రేడియో ద్వారా ముచ్చటిస్తుంటారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు దేశంలో పలువురు ప్రముఖుల గొప్పతనం గురించి ప్రస్తావిస్తారు మోదీ. ఈ కార్యక్రమానికి ప్రజల్లో చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రధాని ఎవరి గురించి మాట్లాడతారు.? ఏ విషయం గురించి ప్రస్తావిస్తారు.? అన్న దానిపై ప్రజల్లో రోజురోజుకీ ఆసక్తి నెలకొంది. దేశమంతా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. అటు ఇప్పటిదాకా జరిగిన గత ఎపిసోడ్‌లలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ చారిత్రకతను, కర్ణాటక సంస్కృతిని, అక్కడి వారి వినూత్న ఆలోచనలను, ప్రశంసనీయ పనులను ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

పశ్చిమ బెంగాల్:

* పశ్చిమ బెంగాల్‌లోని బాన్స్‌బేరియాలో 700 సంవత్సరాల నాటి సంప్రదాయమైన ‘త్రిబేణికుంభోమోహోత్సవ్’ పునరుద్ధరణ గురించిన ప్రధాని మోదీ మన్‌ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ సంప్రదాయం 700 సంవత్సరాల క్రితం నిలిచిపోయి.. ఆ తర్వాత తిరిగి పునఃప్రారంభించిందని పేర్కొన్నారు. ఆ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తులను అభినందించడమే కాకుండా.. వారు కాపాడుతూ వచ్చిన సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతను సైతం ప్రధాని మోదీ ప్రస్తావించారు.

* శాంతాలి కమ్యూనిటీ కోసం స్థానిక ‘ఓల్చికి’ స్క్రిప్ట్‌లో భారత రాజ్యాంగ సంస్కరణను సిద్ధం చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్ గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించి.. అభినందించారు. శ్రీపతి కృషిని ప్రశంసించడమే కాకుండా.. ఇది ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు.

* పశ్చిమ బెంగాల్‌లోని రైతులకు తేనెటీగల పెంపకం ప్రత్యామ్నాయంగా ఎలా మారుతుందో, భారతదేశంలో తేనె విప్లవానికి ఎలా దారితీస్తోందో ప్రధాని మోదీ చర్చించారు. ఇందుకు ఉదాహరణగా డార్జిలింగ్‌లోని గురుడుమ్ గ్రామాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ, తేనెటీగల పెంపకం ఒక విజయవంతమైన వెంచర్‌గా మారిందన్నారు.

కర్ణాటక:

* ఆలంద్ భూతై (అలంద్ భూతాయ్) మిల్లెట్స్ ఎఫ్‌పిసి వంటి రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు(ఎఫ్‌పిసి).. అవి చేసిన ప్రయోగాలు, ప్రయత్నాలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయా కంపెనీలు తయారు చేసే ఖక్రా, బిస్కెట్లు, లడ్డూలు వంటి బాగా ప్రసిద్ది చెందినవిగా అభివర్ణించారు. అంతేకాకుండా బీదర్ జిల్లాలోని హుల్సూర్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన మహిళలు మినుములను పండించడం, ప్రాసెసింగ్ చేయడం వల్ల భారీ ఆదాయాలు పెరిగాయని తెలిపారు.

* కర్ణాటకలో అమృత్ సరోవర్స్ ప్రచారం చురుగ్గా సాగుతోంది. బాగల్‌కోట్ జిల్లాలోని బిల్కెరూర్ గ్రామంలో అందమైన అమృత్ సరోవరాన్ని నిర్మించారు. దీని వల్ల వరదల సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా పర్వతాల నుండి ప్రవహించే నీటి కారణంగా రైతులు నష్టాల నుంచి బయటపడ్డారు.

* రాష్ట్రంలోని 75 ప్రదేశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న అమృత భారతి కన్నడార్థి ప్రచారాన్ని ప్రధాని ప్రశంసించారు.

కేరళ:

* కేరళలోని చిత్తూరులో ఉన్న సెయింట్ మేరీ అప్పర్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన బాలికల బృందం తనకు ప్రత్యేక లేఖ పంపిన విషయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడారు. బాలికలు తమ బొటన వేలిముద్రలను ఉపయోగించి పెద్ద గుడ్డపై భారతమాత చిత్రాన్ని రూపొందించారు. వారి లేఖ చదివిన తర్వాత, బాలికలు తమ ప్రాంతంలో బహిరంగ ప్రచారాలు, నాటకాలు నిర్వహించడం ద్వారా అవయవ దానం గురించి ప్రజలందరిలోనూ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాన మంత్రి గ్రహించారు.

* “పాట్స్ ఫర్ వాటర్ ఆఫ్ లైఫ్” అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్ స్ఫూర్తిదాయకమైన పని గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ కింద, అతను వేసవిలో నీటి కొరతను ఎదుర్కొన్నప్పుడు జంతువులు మరియు పక్షులకు సహాయం చేయడానికి మట్టి కుండలను పంపిణీ చేస్తాడు.

* ఇద్మలకుడి అనే మారుమూల గిరిజన గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చేందుకు సహాయం చేసిన కేరళ ప్రజలను ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అభినందించారు.

పైన పేర్కొన్న అంశాలు మాత్రమే కాదు.. ఆయా రాష్ట్రాల్లో జరిగిన సంస్కృతి కార్యక్రమాలు, పలువురి ప్రముఖుల వినూత్న ఆలోచనలు, వాటి ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా వివరించారు.