US Navy Ship: గ్లోబల్‌ హబ్‌గా ‘మేక్‌ ఇన్ ఇండియా’.. రిపేర్‌ కోసం భారత్‌కు తొలిసారి అమెరికా యుద్ధ నౌక..

మేకిన్‌ ఇండియా ఇప్పుడు గ్లోబల్‌ హబ్‌గా మారుతోంది..ఎస్‌, రిపేర్‌ కోసం…తొలిసారి అమెరికా యుద్ధ నౌక ఇండియాకు రావడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది..

US Navy Ship: గ్లోబల్‌ హబ్‌గా ‘మేక్‌ ఇన్ ఇండియా’.. రిపేర్‌ కోసం భారత్‌కు తొలిసారి అమెరికా యుద్ధ నౌక..
Us Navy Ship
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2022 | 7:54 AM

US Navy Ship Repair in India: భారత్‌ దేశంలో తయారీ రంగంలో మరింత శక్తివంతంగా మారుతోంది.. ఎందుకంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా (Make in India) ఇప్పుడు గ్లోబల్‌ హబ్‌గా మారింది. రిపేర్‌ కోసం తొలిసారి అమెరికా యుద్ధ నౌక ఇండియాకు రావడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. అమెరికా నౌకా దళానికి చెందిన చార్లెస్ డ్రూ రిపేర్‌ కోసం తొలిసారి భారత్‌కు వచ్చింది. అమెరికా యద్ధ నౌక ఆదివారం తమిళనాడుకు చేరుకుంది. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో షిప్‌యార్డ్‌లో ఆ షిప్‌కు రిపేర్‌, నిర్వాహణ పనులు చేపడుతున్నారు. రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ SN ఘోర్మాడే, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. చెన్నైలోని అమెరికా కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్, ఢిల్లీలోని US ఎంబసీలో డిఫెన్స్ అటాచ్‌కు చెందిన రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’కు భారీ ప్రోత్సాహమని రక్షణ మంత్రిత్వశాఖ అభివర్ణించింది. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో కొత్త కోణమంది.US నేవీ షిప్‌కు భారత్‌లో మరమ్మత్తు చేయడం ఇదే తొలిసారి. ఓడ నిర్వహణ పనులు చేపట్టేందుకు కట్టుపల్లిలోని ఎల్‌ అండ్‌ టి షిప్‌యార్డ్‌కు యూఎస్ నేవీ కాంట్రాక్ట్ ఇచ్చింది’ అని ప్రకటించింది. గ్లోబల్ షిప్ రిపేరింగ్ మార్కెట్‌లో భారతీయ షిప్‌యార్డ్‌ల సామర్థ్యాలను ఇది సూచిస్తుందని తెలిపింది. భారతీయ షిప్‌యార్డ్‌లు అధునాతన సాంకేతికతో, తక్కువ ఖర్చుతో ఓడ మరమ్మత్తు, నిర్వహణ సేవలు అందిస్తాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..