Attacks on Doctors: వైద్యులకు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించండి.. ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ..

IMA writes to PM Narendra Modi: దేశంలో ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. రోగులకు ఏమన్నా జరిగితే.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ

Attacks on Doctors: వైద్యులకు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించండి.. ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ..
Ima Writes To Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2021 | 1:36 PM

IMA writes to PM Narendra Modi: దేశంలో ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. రోగులకు ఏమన్నా జరిగితే.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బాధితుల కుటుంబ సభ్యులు దాడులకు పూనుకుంటున్నారు. దీంతోపాటు ఇటీవల బాబా రాందేవ్ అల్లోపతి వైద్యంపై పలు కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐఎంఏ సోమవారం ప్రధానికి లేఖ రాసింది. వైద్యులపై నిరంతరం కొనసాగుతున్న శారీరక, మానసిక దాడిని.. అలాగే స్వార్థ ప్రయోజనాలున్న కొంత మంది వ్యక్తులు ఆధునిక వైద్యం, వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ జోక్యం అవసరమని ఐఎంఏ అభిప్రాయపడింది.

కోవిడ్ మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తున్నారని ఐఎంఏ పేర్కొంది. ఈ పోరాటంలో.. 1400 మంది వైద్యులు ప్రాణాలకు కోల్పోయారని వెల్లడించింది. ఈ క్రమంలో ఆధునిక వైద్యం అల్లోపతి, అదేవిధంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఏ వ్యక్తి అయినా.. అంటువ్యాధుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఇటీవల అసోంలో కోవిడ్ కేర్‌ సెంటర్‌లో ఓ యువ వైద్యుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అలాగే బాబా రాందేవ్‌ అల్లోపతి వైద్యంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఐఎంఏ ఖండించింది. దీంతోపాటు మరలా బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కు జూన్‌ 1న వైద్యులు బ్లాక్‌ డేగా పాటించారు. లేకపోతే జూన్ 18న పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని ఐఎంఏ తెలియజేసింది.

Also Read:

Viral Video: నాగుపాము షాక్స్.. కుక్కపిల్లలు రాక్స్.. విషసర్పాన్ని ఓ ఆటాడేసుకున్నాయి.. షాకింగ్ వీడియో.!

Jama Masjid: ప్రధాని మోదీకి.. ఢిల్లీ జామా మసీదు షాహీఇమామ్ లేఖ.. ఎందుకో తెలుసా..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?