ఆ పోలీసు అధికారిపై పరువు నష్టం దావా వేస్తా, మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్

ఆ పోలీసు అధికారిపై పరువు నష్టం  దావా వేస్తా, మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్
Iam Filing Defamation On Former Cp Says Maharashtra Home Minister Anil Deshmukh

తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై పరువునష్టం దావా వేస్తానని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని,...

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Mar 21, 2021 | 10:42 AM

తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై పరువునష్టం దావా వేస్తానని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని, వాటిని ఆయన నిరూపించాలని అన్నారు. తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు చూపాలన్నారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు 100 కోట్ల వసూలు చేయాలని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ను అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారంటూ పరం బీర్ సింగ్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ లేఖ ముంబై పోలీసు శాఖలో పెద్ద దుమారం రేపింది.

ఇలా వాజేకి అనిల్ టార్గెట్ నిర్దేశించారన్నారు. అయితే ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసు దర్యాప్తులో  పరమ్ బీర్ సింగ్ ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని, వాటిని కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఇలా తనమీద ఆరోపణలు చేస్తున్నారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించారు. దమ్ముంటే వీటిని నిరూపించాలన్నారు. సచిన్  వాజే, మాన్ సుఖ్ హీరేన్ కేసులో తనను తాను రక్షించుకునేందుకు సింగ్ ఇలా నామీద అభాండాలు వేస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ కేసులో పరమ్ బీర్ సింగ్ తను కూడా చిక్కుకోవచ్చునని భయపడుతున్నారన్నారు. సచిన్ గత జనవరిలో ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారని సింగ్ చెబుతున్నారని, మరి అప్పుడే ఎందుకు ఈ విషయాలను బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. సింగ్ పై డిఫమేషన్ కేసు వేస్తానని, లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగపరచినందుకు ఊరుకోబోమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి తలనొప్పిలా తయారైంది. సీఎం థాక్రే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇదే అదనుగా విపక్షాలు అప్పుడే ఆయన ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదట అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలనీ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video

మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Video

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu