AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Married 18 Members: వామ్మో.. లేడీ కాదు.. పెద్ద కిలాడీ.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది.. చివరికి..

Woman Gets Married 18 Members: వామ్మో.. ఈమె లేడీ కాదు.. పెద్ద కిలాడీ అనాల్సిందే. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మందిని పెళ్లి..

Woman Married 18 Members: వామ్మో.. లేడీ కాదు.. పెద్ద కిలాడీ.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది.. చివరికి..
Woman Arrested
Shiva Prajapati
|

Updated on: Mar 21, 2021 | 10:14 AM

Share

Woman Gets Married 18 Members: వామ్మో.. ఈమె లేడీ కాదు.. పెద్ద కిలాడీ అనాల్సిందే. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది. అలా అని ఎవరితోనూ జీవనం సాగించలేదు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నగలు, డబ్బు తీసుకుని ఉడాయించేది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ యువతిని గుజరాత్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆమెతో పాటు.. ఈ వ్యవహారంలో ఆమెకు సపోర్ట్‌గా ఉన్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భాగ్‌వతి అలియాస్ అంజలి అనే యువతి మారు పేర్లు, నకిలీ ధృవపత్రాలతో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నివాసం ఉంది. అలా తాను నివాసం ఉన్న ఆయా ప్రాంతాల్లోని యువకులకు వల వేసి పెళ్లి చేసుకుంది. అలా వారి కుటుంబంలోకి వెళ్లిన అంజలి.. వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు తీసుకుని పారిపోయేది.

ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్‌లోని జునాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన ఓ యువకుడిని అంజలి పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం మెట్టినింటికి వెళ్లిన అంజలి.. యువకుడి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల నగదుతో పాటు.. బంగారు నగలను తీసుకుని పారిపోయింది. దాంతో విషయాన్ని గ్రహించిన బాధిత యువకుడు, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు అంజలి గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పక్కా పథకం ప్రకారం వల పన్ని అంజలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంజలి దిమ్మతిరిగే విషయాలు వెల్లడించింది. ఆమె వెనుక కొందరు సభ్యుల ముఠా ఉందని, గుజరాత్ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. దాదాపు 18 మంది యువకులను పెళ్లి చేసుకుని, వారి వద్ద నుంచి నగదు, నగలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, యువతితో పాటు మరో ఐదుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read:

Illegal Speed Breakers: అనుమతి లేకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేసినందుకు ఆర్మీ స్కూల్‌కి జరిమానా.. ఇది చట్ట విరుద్ధమైన పని..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్‌ – అంబులెన్స్‌ ఢీః.. నలుగురు మృతి.. ముగ్గురికి గాయాలు