MLA Abu Azmi: ఔరంగజేబ్‌పై ప్రశంసల వివాదం.. ఎట్టకేలకు సారీ చెప్పి ఎస్పీ ఎమ్మెల్యే
మహారాష్ట్ర అసెంబ్లీని ఔరంగాజేబ్ వ్యవహారం కుదిపేసింది. ఔరంగజేబ్‌పై ఎస్పీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ ప్రశంసలు కురిపించడంతో వివాదం చెలరేగింది. అబూ ఆజ్మీ దేశద్రోహి అని మహాయుతి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నిరసన, ఆందోళనలకు దిగారు. దీంతో అబూ ఆజ్మీ వెనక్కి తగ్గి.. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

మొఘల్ చక్రవర్తి గొప్పవాడంటూ కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ ఆజ్మీ. ఆయనకు వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో అటు అధికార మహాయుతి ఎమ్మెల్యేలు , ఇటు మహావికాస్ అఘాడి కూటమి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
ఛావా సినిమాలో చరిత్రను వక్రీకరించారనీ, ఔరంగజేబ్ చాలా ఆలయాలు నిర్మించారని అబూ అజ్మి చెప్పారు. ఆయన ఒక క్రూరమైన రాజు కాదన్నారు. శివాజీ మహారాజ్‌కు, ఔరంగజేబుకు జరిగిన యుద్ధాన్ని- మతపరమైన ఘర్షణగా చూడొద్దన్నారు. దీంతో మహాయుతి సభ్యులు అసెంబ్లీ బయట ఆందోళన చేశారు.
తన వ్యాఖ్యలకు రగడ రాజుకోవడంతో అబూ ఆజ్మీ వివరణ ఇచ్చారు. ఔరంగాజేబ్ గురించి పుస్తకాల్లో ఉన్న విషయం గురించే తాను మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. ఛత్రపతి శివాజీని , ఛత్రపతి శంభాజీని తాను అవమానించలేదన్నారు. అబూ ఆజ్మీపై థానేతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




