Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ‘మోదీ’ ఇంటిపేరుపై ‘వివాదం’… నేనలా అనలేదు.. సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…

ప్రధాని మోదీ ఇంటిపేరుకు సంబంధించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: 'మోదీ' ఇంటిపేరుపై 'వివాదం'... నేనలా అనలేదు.. సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
Rahul Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 24, 2021 | 4:25 PM

ప్రధాని మోదీ ఇంటిపేరుకు సంబంధించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వివాదంలో రాహుల్ ప్రధానిని కించపరిచేలా మాట్లాడారంటూ సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ స్థానిక కోర్టులో లోగడ పిటిషన్ దాఖలు చేశారు . ఆ కేసుకు సంబంధించి గురువారం కోర్టుకు హాజరైన రాహుల్…అసలు తాను అలంటి పదాలనే వాడలేదన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ర్యాలీ సందర్భంగా రాహుల్..మోడీ అనే ఇంటిపేరుగల వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రధాని మోదీ ఓ వ్యాపారవేత్తకు 30 లక్షలు ఇచ్చారని మీరు ఆరోపించారా అని మేజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన. ఒక జాతీయ నేతగా తాను అవినీతి నిరుద్యోగం వంటి అంశాలపై గళమెత్తుతూనే ఉంటానని చెప్పారు. మోడీ ఇంటిపేరుగల వ్యక్తులంతా దొంగలేనని మీరు నాడు అన్నారా అన్న ప్రశ్నకు అయన ..తాను అలంటి పదాలు వాడలేదన్నారు. మిగతా ప్రశ్నలకు ఆయన తనకు తెలియదని సమాధానమిచ్చారు.

కాగా ఈ కేసుపై విచారణను మేజిస్ట్రేట్ జులై 12 కి వాయిదా వేశారు. లోగడ కోలార్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అని ప్రస్తావిస్తూ వీరందరికీ ఒకే ఇంటిపేరు ఎలా ఉంటుందన్నారు. దొంగలందరికీ ఇది ఇంటిపేరా అన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఇదిలా ఉండగా..ఆ వ్యాఖ్యల తాలూకు వీడియోను, రికార్డింగును తెప్పించాలని పూర్నేష్ మోడీ గుజరాత్ హైకోర్టును కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం కోర్టు విచారించవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )

Saranga Dariya: నెమలి లాంటి నాట్యానికి, కోయిల లాంటి గాత్రానికి ఎన్నో రికార్డులు… ( వీడియో )