Seaplane: బైక్ ఇంజన్ తో ‘సీప్లేన్’ తయారు చేసిన అస్సాం వాసి… కల నెరవేరిందని హ్యాపీ !

అస్సాంలోని జోర్హట్ జిల్లాకు చెందిన బుబుల్ సైకియా అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఇంజన్ ని వినియోగించి 'సీ ప్లేన్' తయారు చేశాడు.

Seaplane: బైక్ ఇంజన్ తో 'సీప్లేన్' తయారు చేసిన అస్సాం వాసి... కల నెరవేరిందని హ్యాపీ !
Seaplane
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 24, 2021 | 4:31 PM

అస్సాంలోని జోర్హట్ జిల్లాకు చెందిన బుబుల్ సైకియా అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఇంజన్ ని వినియోగించి ‘సీ ప్లేన్’ తయారు చేశాడు. విమానం మాదిరి నీటిలో దూసుకుపోయే సీ ప్లేన్ తయారు చేయాలని, అలాగే విమానంలో ప్రయాణించాలని తాను ఏనాటి నుంచో కలలు కంటూ వచ్చానని వాటిలో మొదటిది నెరవేరిందని ఆయన అంటున్నాడు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా.. అలాగే ఎవరి సహాయమూ తీసుకోకుండా ఆయన దీన్ని తయారు చేశాడట.. తన సొంత డబ్బు సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి దీని తయారీకి అవసరమైన విడిభాగాలన్నీ తెచ్చాడట. బజాజ్ పల్సర్ 220 మోటార్ సైకిల్ ఇంజన్ ను, ఇతర విడిభాగాలను కూడా దీనికి వినియోగించి దీన్ని రూపొందొఇంచినట్టు సైకియా చెప్పాడు. ఇక ఇది నీటిలో దూసుకుపోతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు.మరి దీన్ని ఎవరికోసం ఉపయోగిస్తావంటేఆలోచిస్తానని చెప్పాడు. ఇప్పటివరకు తన జిల్లాలో ఎవరూ ఇలాంటిది తయారు చేయలేదని సంబరంగా తెలిపాడు. స్థానికులు కూడా ఈ సీప్లేన్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

కొన్ని రోజుల క్రితమే ఇదే రాష్ట్రానికి చెందిన నూరుల్ హక్ అనే వ్యక్తి పాత మారుతీ స్విఫ్ట్ కారును తెచ్చి దాన్ని ఖరీదైన లాంబోర్గినీ స్పోర్ట్స్ కారుగా మార్చేశాడు. అయితే ఆయన మెకానిక్ గనుక దాన్ని ఆలా మార్చగలిగాడని కానీ సైకియా మెకానిక్ కాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. సైకియా సృష్టిని వారు ప్రశంసిస్తున్నారు. ఈ వ్యక్తులు పెద్దగా చదువుకోకపోయినా ఇలా తమ నైపుణ్యంతో ఈ విధమైన వాటిని తయారు చేయడం విశేషమే మరి !

మరిన్ని ఇక్కడ చూడండి: Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )

Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు… అయినా అనిరుధ్‌ వెంటే టాలీవుడ్‌ టాప్‌ హీరోలా..? ( వీడియో )