New Delhi: ‘నీ సుష్’ అంటూ చిన్నోడికి చిన్నదాని క్షమాపణలు.. వైరల్ అవుతున్న బిల్‌బోర్డ్ ఫోటోలు..
Billboard Apology: ప్రేమికులు ఒకప్పుడు లెటర్స్ ద్వారా ఒకరి సమాచారం మరొకరు తెలుసుకువారు. కాలానుగుణంగా వచ్చిన టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు చాట్ చేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ పాత ట్రెండ్. అవును ఇంటర్‌నెట్, సోషల్ మీడియా కూడా పాత ట్రెండే. ఎందుకంటే....

New Delhi: ప్రేమికులు ఒకప్పుడు లెటర్స్ ద్వారా ఒకరి సమాచారం మరొకరు తెలుసుకువారు. కాలానుగుణంగా వచ్చిన టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు చాట్ చేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ పాత ట్రెండ్. అవును ఇంటర్‌నెట్, సోషల్ మీడియా కూడా పాత ట్రెండే. ఎందుకంటే.. నోయిడాలోని ఓ చిన్నది తన చిన్నోడి కోసం వినూత్నమైన రీతిలో తన భావాలను తెలియజేసింది. తనవాడికి క్షమాపణలు చెప్పేందుకు ఏకంగా ఓ పెద్ద బిల్‌బోర్డ్‌పై తన మనసులోని మాటలతో ఓ బ్యానర్ వేయించింది. అసలు ఆ బిల్‌బోర్డ్‌పై ఏమని ఉందంటే..
ఓఖ్లా పక్షుల అభయారణ్యం సమీపంలోని నోయిడా సెక్టార్ 125లో ఫ్లైఓవర్ పక్కన ఉన్న బిల్‌బోర్డ్‌పై ‘నన్ను క్షమించు సంజూ. మళ్లీ నిన్ను బాధపెట్టను. నీ సుష్’ అంటూ బ్యానర్ ఉంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. క్షమాపణ చెప్పడానికి ఇంతకంటే గొప్ప మార్గం లేదని, సంజూ కోసం గాలింపు చర్యలు వెంటనే ప్రారంభం కావాలని రాసుకొస్తున్నారు. అసలు ఇది నిజమేనా..? ఇంత చిన్న వయసులో అంత ప్రేమ ఎలా..? అంటూ మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.




In today’s episode of what the fuck goes on in Noida pic.twitter.com/cScEMdkZmE
— 🥭 🐭 (@uDasKapital) June 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..