సోనియా గాంధీతో సీనియర్ నేత కమల్ నాథ్ భేటీ.. పార్టీ చీఫ్ కావచ్చునన్న ఊహాగానాల ఖండన
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలాసేపు జరిగినట్టు తెలిసింది. దీంతో పార్టీ అధ్యక్షునిగా ఈయనను నియమించవచ్చునని ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలాసేపు జరిగినట్టు తెలిసింది. దీంతో పార్టీ అధ్యక్షునిగా ఈయనను నియమించవచ్చునని ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిని ఆయన ఆ తరువాత ఖండిస్తూ..ఇదంతా ‘రబ్బిష్; అని కొట్టి పారేశారు. తాము పార్టీకి సంబంధించిన పలు విషయాలను చర్చించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం గురించి తాము చర్చించామని ఆయన చెప్పారు. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కి ఈయన చాలా సన్నిహితులని తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్ నేత,నవజ్యోత్ సింగ్ సిద్దు ని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ గా నియమిస్తారన్న ఊహాగానాలపై స్పందించేందుకు కమల్ నాథ్ నిరాకరించారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే పంజాబ్ కాంగ్రెస్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ నియామకాలు జరగవచ్చునన్న వార్తలను పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతానికి ఆ యోచన లేదని వివరించాయి. కాగా సిద్దు, అమరేందర్ సింగ్ మధ్య విభేదాల పరిష్కారానికి పార్టీ రాజీ సూత్రం రూపొందించిందని మొదట తెలియవచ్చింది.
ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అలాగే సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. వర్కింగ్ కమిటీకి సభ్యులను కూడా ఎన్నుకోవాల్సి ఉందని, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చునని తెలుస్తోంది. అటు కమల్ నాథ్ ఢిల్లీలో మరి రెండు రోజులు ఉండవచ్చునని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ఆయన మదింపు చేయవచ్చునని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..
IND vs SL: ఫేస్‌బుక్‌లో భారత్, శ్రీలంక సిరీస్.. ఎలా చూడాలో తెలుసా?