‘మీ విశాల హృదయాన్ని చాటండి’..ముంబైలో బిగ్ బీ ఇంటి ఎదుట మహారాష్ట్ర నవనిర్మాణ సేన నిరసన ..ఎందుకంటే..?
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం. ప్రతీక్ష' ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.,
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం. ప్రతీక్ష’ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు., ‘షో యువర్ బిగ్ హార్ట్’ (మీ విశాల హృదయాన్ని చాటండి) అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని వీరు ప్రొటెస్ట్ చేశారు. మీ ఇంటి వద్ద సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డును వెడల్పు చేసేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి సహకరించాలని వారు డిమాండ్ చేశారు. అమితాబ్ బచ్చన్ ఇల్లు ‘ప్రతీక్ష’..ఇంటి ముందు తాము ఇంకా నిలబడే ఉన్నామని, ఎంతసేపయినా ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తామని ఈ సంస్థ నేత మనీష్ ధురి అన్నారు. ఇక్కడి రోడ్డు 60 అడుగుల వెడల్పు కావలసి ఉందని, కానీ ఈ నివాసం కారణంగా 45 అడుగులు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ట్రాఫిక్ కి అవరోధంగా ఉండడంతో ఈ బంగళా గోడను పడగొట్టాలని కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యోచిస్తోంది. అయితే బిగ్ బీ బంగళా గోడను పడగొట్టాలంటే సామాన్యం కాదు.. అందుకే కోర్టులో కేసు వేసింది.
అయితే ఇదివరకే స్థానికులు,మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు దీనిపై ఆయనకు విజ్ఞప్తి చేసినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఇప్పటికే ఆయనకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నామని వీరెను చెప్పారు. ఇప్పటికైనా ఆయన సానుకూలంగా స్పందించి అనుమతిస్తే కోర్టులో కేసును కార్పొరేషన్ ఉపసంహరించుకుంటుందని వీరు పేర్కొన్నారు.. మరి తమ నిరసనతోనైనా అమితాబ్ బచ్చన్ సానుకూలంగా స్పందిస్తారని వీరు ఆశిస్తున్నారు. ఇది కేవలం స్థానిక సమస్యే అయినా బిగ్ బీ ప్రస్తావన ఉంది గనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!
Tutoroot: ఉపాధ్యాయులకు శుభవార్త.. ట్రైన్ ది టీచర్ పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్