AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి.. హైదరాబాద్ ఎంపీ ఏమన్నారంటే..

ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని నివాసంపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓవైసీ నివాసంపై నల్ల ఇంకుతో దాడి చేశారు. దీంతో పాటు పోస్టర్లు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అసదుద్దీన్ నివాసానికి చేరుకొని ఇంకును తుడిసి వేశారు. అనంతరం ఓవైసీ ఇంటి ముందు పోలీసులు పహారా కాసారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి.. హైదరాబాద్ ఎంపీ ఏమన్నారంటే..
Asaduddin Owaisi
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2024 | 8:40 AM

Share

ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని నివాసంపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓవైసీ నివాసంపై నల్ల ఇంకుతో దాడి చేశారు. దీంతో పాటు పోస్టర్లు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అసదుద్దీన్ నివాసానికి చేరుకొని ఇంకును తుడిచి వేశారు. అనంతరం ఓవైసీ ఇంటి ముందు పోలీసులు పహారా కాసారు. లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా అసదుద్దీన్‌ ‘జై పాలస్తీనా’ అనడంపై కూడా వివాదానికి దారితీసింది. భారత పార్లమెంట్‌ సాక్షిగా మరో దేశానికి ఓవైసీ విధేతయ చూపడంపై బీజేపీ నేతలతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. దీంతో ఓవైసీ వ్యాఖ్యలను తప్పుబుడుతూ ఆయన ఇంటికి పోస్టర్లు అంటించారు బజరంగ్‌ దళ్ కార్యకర్తలు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఢిల్లీలో తన ఇంటి దగ్గర జరుగున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ.. ఢిల్లీలోని తన నివాసంపై టార్గెట్ చేస్తూ పదేపదే దాడులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం వంటివి చేసిన తర్వాత పారిపోకుండా తనను నేరుగా ఎదుర్కొంవాలని సవాల్‌ విసిరారు ఓవైసీ..

అసదుద్దీన్ ట్వీట్..

కాగా.. ఓవైసీ ఇంటిపై దాడి జరగడం దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే గతేడాది ఆగష్టు కూడా ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై ఎటాక్ చేశారు. అప్పుడు తలుపులపై రెండు అద్దాలు పగలగొట్టారు. పార్లమెంట్‌లో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడినప్పుడల్లా తన ఇంటిపై దాడి చేయడం అలవాటుగా మారిందంటూ ఓవైసీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని పలువురు రాష్ట్రపతికి లేఖలు రాయగా.. బీజేపీ నేతలు ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..