Bihar Blast: ఇంట్లో భారీ పేలుడు.. పది మంది మృతి.. ఘటనకు అదే కారణమని అనుమానాలు
బిహార్(Bihar) భాగల్ పుర్జిల్లాలోని కాజ్వాలీచక్ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు(Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
బిహార్(Bihar) భాగల్ పుర్జిల్లాలోని కాజ్వాలీచక్ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు(Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లూ దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఆ కుటుంబం నాటు బాంబులు, బాణాసంచా తయారు చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం. పేలుడు సామగ్రి భారీగా ఉండటం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున పేలుడు జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలానికి చేరుకుని, పేలుడుకు గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు.
పేలుడు పదార్థాల స్వభావాన్ని తెలుసుకోవడానికి క్షతగాత్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసే పనిలో ఉన్నామని.. నమూనాలను సేకరించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని కూడా పిలిపించామని సుబ్రత్ కుమార్ తెలిపారు. పేలుడు చాలా తీవ్రతతో కూడుకున్నదని.. పక్క ఇళ్లలో నిద్రిస్తున్నవారికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించిందని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. ఇక, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. కుప్పకూలిన భవన శిథిలాలను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. బాధితులకు అన్ని రకాల సహయం అదిస్తామని భరోసా ఇచ్చారు.
Also Read
Mirchi price: పండింది మిర్చి కాదు.. బంగారం.. క్వింటా ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
LIC IPO Alert: ఎల్ఐసీ ఐపీవో వాయిదా.. మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. ప్రభుత్వ వర్గాల మాటేంటి..
Cooking Oil: సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఎంత వాడతారు.. ధరల పెరుగుదలలో వార్ ఎఫేక్ట్ ఎంత.. పూర్తి వివరాలు..