AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం.. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు: మంత్రి అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కాశ్మీర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన సంచనల ప్రకటన చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా..

Amit Shah: కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం.. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు: మంత్రి అమిత్‌ షా
Amit Shah
Subhash Goud
|

Updated on: Oct 05, 2022 | 9:16 PM

Share

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కాశ్మీర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన సంచనల ప్రకటన చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా బారాముల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని, వారి ఉనికి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అన్నారు. బారాముల్లాలో బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్‌ షా.. పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము కాశ్మీర్‌ ప్రజలతో మాత్రమే చర్చిస్తామన్నారు. ఉగ్ర కుట్రల నుంచి కాశ్మీర్‌ను కాపాడుకుంటామని, 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌.. ఉగ్రకుట్రలు పన్నుతోన్న పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటోందని ఎద్దేవా చేశారు అమిత్‌ షా.

ఈ సమయంలో అమిత్‌ షా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు లేకుండా పకడ్బంధీ చర్యలు చేపడుతున్నామన్నారు. అదే సమయంలో బహిరంగ సభలో ప్రసంగించే ముందు, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని కూడా సమీక్షించారు. ప్రసంగం అనంతరం అమర జవాన్ కుటుంబాన్ని కలిశారు.

భద్రతపై సమీక్ష:

ఇవి కూడా చదవండి

కాగా, మూడో రోజైన బుధవారం జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న షా కేంద్రపాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్, పోలీసు, సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇతర పార్టీల పాలన కారణంగా కశ్మీర్‌లో పెద్దగా అభివృద్ధి ఏమి జరగేలదన్నారు.

అలాగే సవరించిన ఓటర్ల జాబితాల ప్రచురణను ఎన్నికల సంఘం పూర్తి చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అమిత్ షా అన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురించే పనిని పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించబడతాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు లేవని, కానీ దానిని రద్దు చేసిన తర్వాత, గుజ్జర్, బకర్వాల్, పహారీ వర్గాల ప్రజలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించవచ్చని హోంమంత్రి చెప్పారు. రిజర్వేషన్ల ప్రకారం ప్రతి ఒక్కరికీ న్యాయమైన వాటా లభిస్తుందని షా అన్నారు. ఏ భాగానికి నష్టం ఉండదన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పోలీసు ముదస్సిర్ షేక్ కుటుంబాన్ని ఆయన కలిశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి