మహారాష్ట్ర గవర్నర్ లేఖపై అమిత్ షా అసంతృప్తి

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ ఇంకా దుమారం రేపుతోంది. ఈ లేఖపై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ..ఈ లెటర్ హుందాగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'సెక్యులర్' వంటి పదాలను ఆయన వినియోగించకుండా ఉండాల్సిందన్నారు.

మహారాష్ట్ర గవర్నర్ లేఖపై అమిత్ షా అసంతృప్తి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 5:36 PM

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ ఇంకా దుమారం రేపుతోంది. ఈ లేఖపై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ..ఈ లెటర్ హుందాగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘సెక్యులర్’ వంటి పదాలను ఆయన వినియోగించకుండా ఉండాల్సిందన్నారు. తానీ లేఖను చదివానని, చాలా పదాలను కొష్యారీ ఉపయోగించకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.  రాష్ట్రంలో మళ్ళీ గుడులను, ప్రార్థనా మందిరాలను ఎప్పుడు తెరుస్తారంటూ  కోష్యారీ ఇటీవల ముఖ్యమంత్రి ఉధ్ధవ్ కి సుదీర్ఘమైన లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో మీరు సెక్యులరా కాదా అని, హిందుత్వ నినాదాన్ని వదిలేశారా అని ఇలా చాలా ప్రశ్నలు వేశారు. దీనిపై ఉధ్ధవ్ తీవ్రంగా స్పందించడం, ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ సైతం ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనమైంది. గవర్నర్ ను రీకాల్ చేయాలని శివసేన ఒక దశలో డిమాండ్ చేసింది కూడా. తాజాగా హోంమంత్రి అమిత్ షా కూడా పరోక్షంగా గవర్నర్ తీరును తప్పుపట్టడం విశేషం.