తండ్రితో పోటీ పడిన ‘బాల గాన గంధర్వుడు’, వీడియో చూసేద్దాం !
నిండా నాలుగైదేళ్ళ వయస్సు లేదు. కానీ అప్పుడే ఆ గడుగ్గాయి తండ్రితో సమానంగా క్లాసికల్ సాంగ్ పాడేస్తున్నాడు. హార్మోనియం వాయిస్తూ తండ్రి పాడుతుంటే తానూ గళం కలిపాడు. ఆయన మధ్య మధ్య కాస్త వేగంగా పాడుతుంటే ..
నిండా నాలుగైదేళ్ళ వయస్సు లేదు. కానీ అప్పుడే ఆ గడుగ్గాయి తండ్రితో సమానంగా క్లాసికల్ సాంగ్ పాడేస్తున్నాడు. హార్మోనియం వాయిస్తూ తండ్రి పాడుతుంటే తానూ గళం కలిపాడు. ఆయన మధ్య మధ్య కాస్త వేగంగా పాడుతుంటే ..పెద్ద మొనగాడిలా ఆపి.. మెల్లగా పాడమని సజెషన్స్ కూడా ఇచ్చాడు. తన చిన్ని గొంతుతో కష్టమైన పదాలను కూడా ఇష్టంగా మరీ పాడాడు ఆ బుజ్జి గాన గంధర్వుడు. ఈ చిన్నారి తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే అవదూ మరి ? ఇప్పుడే ఇలా పాడేస్తున్నాడు..ఇక పెద్దయ్యాక ఎంత పెద్ద సింగర్ అవుతాడో అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నెటిజన్లంతా ఈ చిన్నారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారంటే ఆశ్చర్యమేముంది ?
❤️❤️❤️???????
Little fella has no chill pic.twitter.com/ytp2q5PvbT
— Sandhya (@TheRestlessQuil) October 18, 2020