Tamil Nadu: తమిళనాడులో హిందీపై ఆగని వ్యతిరేకత.. రైల్వే బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్లరంగు

కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను.. పలు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాంపై విమర్శలు గుప్పించాయి. అయితే తమిళనాడులో హిందీపై వ్యతిరేకత ఇంకా కొనసాగుతోంది.

Tamil Nadu: తమిళనాడులో హిందీపై ఆగని వ్యతిరేకత.. రైల్వే బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్లరంగు
Railway Board
Follow us
Aravind B

|

Updated on: Apr 01, 2023 | 5:26 PM

కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను.. పలు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాంపై విమర్శలు గుప్పించాయి. అయితే తమిళనాడులో హిందీపై వ్యతిరేకత ఇంకా కొనసాగుతోంది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్టుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పుశారు. ఆ బోర్టుపై తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అక్షరాలు రాసి ఉండగా.. హిందీని చెరిపివేసి మిగతా రెండింటి జోలికి వెళ్లలేదు. శుక్రవారం రోజున దీనిని గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బోర్టుపై మళ్లీ హిందీ అక్షరాలను రాయించారు.

చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూయడంపై రైల్వే పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ పని చేసినట్లు కొంతమంది ప్రయాణికుల నుంచి తెలుసుకున్నారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలు సరిగా పని చేయడకపోవడంతో వాటి ద్వారా నిందితులను గుర్తించడం కష్టమేనని భావిస్తున్నారు.ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నదని సీఎం ఎంకే స్టాలిన్‌ పలుమార్లు విమర్శించారు. తాజాగా పెరుగు ప్యాకెట్ల లెబుల్స్‌ను హిందీ పదమైన దహీగా పేర్కోవాలంటూ కేంద్ర ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విమర్శలు ఎక్కవగా రావడంతో కేంద్ర సంస్థ ఆ నోటీస్‌ను వెనక్కి కూడా తీసేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి