Helmets: వాహనదారులకు హెచ్చరిక.. ఈ హెల్మెట్లపై కేంద్రం నిషేధం.. రూ.లక్ష జరిమానా.. ఏడాది జైలు శిక్ష!

Helmets: వాహనదారులకు అలర్ట్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని హెల్మెట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్).

Helmets: వాహనదారులకు హెచ్చరిక.. ఈ హెల్మెట్లపై కేంద్రం నిషేధం.. రూ.లక్ష జరిమానా.. ఏడాది జైలు శిక్ష!
Helmets
Follow us
Subhash Goud

|

Updated on: Jun 13, 2021 | 9:20 AM

Helmets: వాహనదారులకు అలర్ట్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని హెల్మెట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ఉన్న ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జూన్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. అందువల్ల దేశంలో తప్పకుండా బీఐఎస్ గుర్తింపు ఉన్న ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. నాణ్యత లేనటువంటి ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను, డూప్లికేట్ ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను వాడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ ఐఎస్‌ఐ హెల్మెట్లను తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా దిగుమతి చేసుకోవడం, వాహనదారులు కొనుగోలు చేయడం వంటివి శిక్షార్హం. ఇలా చేస్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా పడుతుంది. జరిమానానే కాకుండా ఒక ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.

కాగా, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠన చర్యలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కొత్త కొత్త నిబంధనలు జారీ చేస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో నాణ్యతతో కూడిన హెల్మెట్లు ఉండకపోవడంతో వాహనదారుల తలకు తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హెల్మెట్ల విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది. అయితే హైదరాబాద్‌ నగరంలో వాహనంపై కూర్చున్న ఇద్దరికి కూడా హెల్మె్‌ట్‌ లేకుంటే చర్యలు చేపడుతున్నారు పోలీసులు. వెనుకాల కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేకుండా జరిమానా విధిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Telangana Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా 2.22 లక్షల మందికి రైతు బంధు.. మొత్తం 61.55 లక్షల మందికి సాయం