Dholavira: భారత్‌కు మరో శుభవార్త చెప్పిన యునెస్కో.. ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద‌గా ‘ధోల‌విర’ ప్రకటన..

Harappan City of Dholavira: భారత్‌కు యునెస్కో మ‌రో శుభ‌వార్త అంద‌జేసింది. గుజ‌రాత్‌ కచ్ జిల్లాలోని ధోల‌విర ప్రాంతాన్ని ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో

Dholavira: భారత్‌కు మరో శుభవార్త చెప్పిన యునెస్కో.. ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద‌గా ‘ధోల‌విర’ ప్రకటన..
Harappan City Of Dholavira
Follow us

|

Updated on: Jul 27, 2021 | 8:37 PM

Harappan City of Dholavira: భారత్‌కు యునెస్కో మ‌రో శుభ‌వార్త అంద‌జేసింది. గుజ‌రాత్‌ కచ్ జిల్లాలోని ధోల‌విర ప్రాంతాన్ని ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో చేర్చుతూ యునెస్కో మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌కు సంబంధించిన ఐదు ప్రదేశాలల్లో ధోల‌విర న‌గ‌రం ఓ ప్రదేశంగా ప్రసిద్ధి. ధోల‌విర నగరానికి వ‌ర‌ల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. దోల‌విరా నగరం ఇప్పుడు భార‌త్లో‌ 40వ వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తుంద‌ంటూ వెల్లడించారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఇలా ట్విట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఆనందించాల్సిన విషయం.. ధోలావిరా పురాతనమైన ముఖ్యమైన పట్టణ కేంద్రం.. గతంలో ఈ పట్టణంతో ముఖ్యమైన బంధం ఉందంటూ మోదీ పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాలంటూ ట్విట్ చేశారు.

వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌లల్లో ఇండియా సూప‌ర్‌-40 క్లబ్‌లో చేరింద‌ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశం ఈ రోజు గర్వపడాల్సిన రోజని.. ముఖ్యంగా గుజ‌రాతీ ప్రజలకు ఇది శుభ‌దిన‌మ‌న్నారు. 2014 నుంచి భార‌త్‌లో కొత్తగా పది ప్రాంతాలు ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద‌ జాబితాలో చేరాయ‌ని తెలిపారు. ఇది మొత్తం సైట్లల్లో నాలుగ‌వ వంతు అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ క‌మిట్‌మెంట్ వ‌ల్లే ఇది సాధ్యమైందంటూ మంత్రి కిష‌న్ రెడ్డి కొనియాడారు. భార‌తీయ సంస్కృతి, వార‌స‌త్వం, జీవ‌న విధానాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటుతున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రిత‌ం తెలంగాణ‌లోని రామ‌ప్ప ఆల‌యాన్ని కూడా వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించిన విష‌యం తెలిసిందే.

Also Read:

Viral News: అరెరే.. వెళ్తున్న బస్సులో వరద.. ప్రయాణికుల అవస్థలు మాములుగా లేవు పాపం.. వీడియో వైరల్..

Indian Economy: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. భారత్ వృద్ధి రేటు అంచ‌నాను కుదించిన ఐఎంఎఫ్‌..