AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అరెరే.. వెళ్తున్న బస్సులో వరద.. ప్రయాణికుల అవస్థలు మాములుగా లేవు పాపం.. వీడియో వైరల్..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతున్నాయి.

Viral News: అరెరే.. వెళ్తున్న బస్సులో వరద.. ప్రయాణికుల అవస్థలు మాములుగా లేవు పాపం.. వీడియో వైరల్..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2021 | 8:28 PM

Share

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక చిన్న చిన్న వాహనాలు ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయితే తాజాగా ఢిల్లీలో రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో వర్షపు నీరు వరదల ప్రవహిస్తున్నాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నిన్న మొన్నటి వరకు దక్షణ భారతదేశాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు… ఉత్తర భారత దేశాన్ని మాత్రం ఇంకా వీడడం లేదు. ఎడతెరపి లేకుండా కురుస్తూ… దాదాపు ఉత్తర భారతాన్ని స్థంబించేలా చేస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాలకు అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెర్లను తలపిస్తున్నాయి. అయితే అక్కడి వరద పరిస్థితికి అద్దం పట్టేలా..ఓ వీడియోటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రయాణికులతో నిండిఉన్న ఢిల్లీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులోకి రెండు అడుగుల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సీట్లను ఎక్కడం… రాడ్లను పట్టుకుని వేలాడడం చేయాల్సి వచ్చింది. ఇక ఇటీవల చైనాలో సంభవించిన వరదల దాటికి ఓ మెట్రో రైల్లో నడుము లోతు వరకు నీళ్లు చేరిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడా రెండు ఫోటోలను కంపేర్‌ చేస్తూ…కొందరు నెటిజన్లు మీమ్స్‌తో … ట్రోల్స్‌తో నెట్టింట హంగామా చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: ఒత్తిడిని తగ్గించే మొక్కలు.. మీ ఇంట్లో ఉంటే మనశ్శాంతి మీ వెంటే.. అవెంటో తెలుసా..

Thimmarusu Pre Release Event: ‘తిమ్మరుసు’ కోసం రంగంలోకి మరో హీరో.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్