Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక తీర్పు.. ఆ పిటిషన్ కొట్టివేత

కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శివలింగం కార్బన్‌ డేటింగ్‌కు అనుమతిని..

Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక తీర్పు.. ఆ పిటిషన్ కొట్టివేత
Gyanvapi Mosque Case
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2022 | 3:33 PM

కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శివలింగం కార్బన్‌ డేటింగ్‌కు అనుమతిని నిరాకరిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కార్బన్‌ డేటింగ్‌ కోసం ఓ భక్తుడు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. శివలింగం వంటి నిర్మాణానికి కార్బన్‌ డేటింగ్‌కి ఆదేశించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఎలాంటి సర్వే జరిపినా అది సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే అని కోర్టు తెలిపింది. కోర్టు తీర్పునేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే సెప్టెంబర్‌ 12న మసీదు ప్రాంగణం లోని శృంగార గౌరీ ప్రతిమలకు పూజల విషయంలో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అంజుమన్‌ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వారణాసి జిల్లా కోర్టు జడ్జి అజయ్‌ కృష్ణ విశ్వేష్‌ తీర్పును వెల్లడించారు. శృంగారగౌరీ ప్రతిమకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలను కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కొట్టేయాలని అంజుమన్‌ ఇంతజామియా కమిటీ నేతృత్వంలో ముస్లిం సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ముస్లిం సంస్థల పిటిషన్‌ను వారణాసి కోర్టు గత నెల12న కొట్టేసింది.

ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మసీదులో లభించిన శివలింగంపై కార్భన్‌ డేటింగ్‌ చేయాలని కోర్టును ఆశ్రయిస్తామని హిందు సంఘాలు గతంలో తెలిపాయి. తాజాగా ఈ శివలింగంపై కార్బన్‌ డేటింగ్‌కు సంబంధించిన పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి