గంటన్నరలో మారిన తలరాత.. చేపల అమ్మే వ్యక్తి సుడి తిరిగిపోయింది.. లాటరీలో లక్షలు

ఫేట్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. అందుకు ఈ చేపల అమ్మే వ్యక్తి స్టోరీనే ఉత్తమ ఉదాహారణ. వివరాలు తెలుసుకుందాం పదండి....

గంటన్నరలో మారిన తలరాత.. చేపల అమ్మే వ్యక్తి సుడి తిరిగిపోయింది.. లాటరీలో లక్షలు
Pookunju with his wife Mumtaz, son Muneer and daughter Muhsina.
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2022 | 12:41 PM

అతడు బైక్ ఊరూరా తిరుగుతూ చేపలు అమ్ముకునే వ్యక్తి. రెక్కాడితే కానీ డొక్కడని బతుకు. అయితే అక్టోబర్ 12, 2022 డేట్‌ని మాత్రం అతను ఎప్పటికీ మర్చిపోలేడు. సినిమాలో మాదిరిగా అతని లైఫ్‌లో ఈ రోజున ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. గంటల వ్యవధిలో జరిగిన పరిణామాలను అతడు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సుమారు రూ.12 లక్షల రుణం చెల్లించనందుకు బ్యాంకు నుంచి అతనికి నోటీసు వచ్చింది. గంటన్నర తర్వాత లాటరీలో 70 లక్షలు గెలుచుకున్నట్లు తెలిసింది. ఇంతకంటే క్రేజీ డే ఏమైనా ఉంటుందా చెప్పండి.

వివరాల్లోకి వెళ్తే..  కేరళ కొల్లాంలోని మైనాగపల్లి ఎడవనాస్సేరిలో నివాసముంటున్న పూకుంజు(40) తన కుటుంబ పోషణ కోసం మోటార్‌సైకిల్‌పై చేపలు అమ్ముతుండేవాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇల్లు కట్టుకునేందుకు కార్పొరేషన్ బ్యాంకులో రూ.7.45 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి బాకీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. మధ్యలో కరోనా బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ బాకీ వడ్డీతో సహా దాదాపు రూ.12 లక్షలకు చేరింది. దీంతో బ్యాంకు నుంచి అటాచ్‌మెంట్ నోటీసు రావడంతో తన ఇల్లు పోతుందేమోనని ఆందోళన చెందాడు. అయితే పూకుంజుకు తన తండ్రి నుంచి ఓ అలవాటు అబ్బంది. అది లాటరీలు కొనడం. చిన్నప్పటి నుంచి అలా లాటరీలు తీస్తూనే ఉండేవాడు. అయితే ఇప్పటివరకు రూ. 2,000-రూ. 10,000 మధ్య మాత్రమే గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ప్లామూట్టిల్ మార్కెట్‌లో లాటరీ విక్రయదారుడు గోపాల పిళ్లై నుంచి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. గురువారం బ్యాంక్ నోటిసు వచ్చిన గంటర్నర తర్వాత.. ఆ లాటరీ టికెట్‌కు భారీ ప్రైజ్ మనీ వచ్చిందన్న వార్త తెలిసింది. దీంతో  ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

ఇప్పుడు తాను లోన్ కట్టగలని.. కుటుంబంతో ప్రశాంతంగా జీవించగలనని పూకుంజు చెప్పాడు. తన కూతురు ముహ్సీనా 10వ తరగతి, కొడుకు మునీర్‌ ప్లస్‌టూ చదువుతున్నారని.. వారి చదువుకు కోసం మిగిలిన డబ్బు వినియోగిస్తానని తెలిపాడు. ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తుకు భరోసా దొరికిందని ఆనందం వ్యక్తం చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..