Covid-19 Patient: ఆ మహిళ చనిపోతుందని అనుకున్నారు.. కానీ ఏడు నెలల తర్వాత..

Covid-19 Patient: కరోనా పీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారిని కాపాడుకునేందుకు కుటుంబాలు

Covid-19 Patient: ఆ మహిళ చనిపోతుందని అనుకున్నారు.. కానీ ఏడు నెలల తర్వాత..
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 20, 2021 | 9:25 PM

Covid-19 Patient: కరోనా పీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారిని కాపాడుకునేందుకు కుటుంబాలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ.. కొంతమంది ప్రాణాలు మాత్రం దక్కడం లేదు. ఓ కుటుంబంలోని మహిళ కరోనా బారిన పడి ఏకంగా ఆరునెలలపాటు పోరాడింది. చాలా సందర్భాల్లో ఆ మహిళ ఇంటికి తిరిగివస్తదో రాదో అనుకున్నారు ఆ కుటుంబసభ్యులు. కానీ ఆ మహిళ పట్టుదలతో దాదాపు ఆరున్నర నెలల పాటు కరోనాపై పోరాడి ఎట్టకేలకు ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన గీతా ధార్మిక్‌ (45) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పరిస్థితి సీరియస్‌ కావడంతో ఈ ఏడాది మే 1న ఆసుప్రతిలో చేరింది. అప్పటి నుంచి ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తోంది. కొన్నిసార్లు పరిస్థితి విషమించినప్పటికీ.. మహిళ ధైర్యంతో నిలిచింది. 202 రోజుల అనంతరం ఆమె శనివారం డిశ్చార్జ్‌ అయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె మొత్తం 202 రోజుల పాటు దాహోద్, వడోదరలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంది. ఆ సమయంలో ఆమెను వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినట్లు ఆమె భర్త త్రిలోక్ ధార్మిక్ తెలిపారు.

కాగా.. గీతా ధార్మిక్‌ భర్త త్రిలోక్ ధార్మిక్ దాహోద్‌లో రైల్వే ఇంజనీర్ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో భోపాల్‌ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో గీత ధార్మిక్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు భర్త తెలిపారు. చికిత్స సమయంలో గీత ఆరోగ్య పరిస్థితి తొమ్మిది సార్లు విషమించిందని ఆయన చెప్పారు. ఏప్రిల్‌ 23న గీత తల్లి మరణించగా భోపాల్‌కు వెళ్లారు. 25న దాహోద్‌కు తిరిగి వచ్చిన అనంతరం తన భార్యకు కరోనా లక్షణాలు కనిపించాయన్నారు. మే 1న పాజిటివ్‌గా తేలిందని అదే రోజు రాత్రి దాహోద్‌లోని రైల్వే ఆసుపత్రిలో చేర్పించినట్లు త్రిలోక్‌ ధార్మిక్‌ వెల్లడించారు. అప్పటినుంచి తన భార్య ఆరోగ్యంపై మదనపడుతున్నట్లు వెల్లడించారు. గీత కోలుకోని ఇంటికి రావడంపై సంతోషం వ్యక్తంచేశారు.

Also Read:

Love: ప్రియుడు మాట్లాడటం లేదని 100 నెంబర్‌కు ఫోన్‌ చేసిన ప్రియురాలు.. చివరకు పోలీసులు ఏం చేశారంటే..?