గుజరాత్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు

గుజరాత్​రాష్ట్రంలోస్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పోలింగ్​ నిర్వహిస్తున్నారు అధికారులు.

  • Balaraju Goud
  • Publish Date - 8:33 am, Sun, 28 February 21
గుజరాత్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు
పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

Gujarat local body election : గుజరాత్​రాష్ట్రంలోస్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పోలింగ్​ నిర్వహిస్తున్నారు అధికారులు. గుజరాత్‌లోని 81 మునిసిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రశాంతంగా జరగుతుంది. ఉదయం నుంచి ఓటు వేసేందుకు జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొవిడ్​ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

గుజరాత్ రాష్ట్రంలో మునిసిపాలిటీలలో 680 వార్డులలో 2,720, జిల్లా పంచాయతీలలో 980, తాలూకా పంచాయతీలలో 4,773 చొప్పున మొత్తం 8,473 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇందుకు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,008 పోలింగ్ బూత్‌లను ఏర్పాట్లు చేసినట్లు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికలకు రాష్ట్రంలో దాదాపు 3.04 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇక రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక రాష్ట్ర రిజర్వ్ పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 12 సిఎపిఎఫ్ కంపెనీలు 54,000 హోమ్ గార్డ్స్ తోసహా 44,000 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీపడుతోంది. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఆధిపత్య శక్తిగా ఉంది. ఇప్పటి వరకు అత్యధిక స్థానాల్లోనూ బీజేపీ మద్దతుదారులే. అయితే, ఈసారి కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇటీవల పెరిగిన ఇంధన ధరలు అధికార పార్టీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని తాము అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ఈ అంశం సహాయపడుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

ఇక, ఇతర పార్టీలకు చెందిన 2,097 మంది పోటీపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, గోద్రా, మోడసా, భారుచ్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపాయి. అటు మైనారిటీ ఆధిపత్య మునిసిపాలిటీలలో తమ అభ్యర్థులను నిలబెట్టినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇదిలావుంటే, రెండు ప్రధాన పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండిః PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ నాయకత్వ పురస్కారం..