AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council Meeting : నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆర్థిక మంత్రి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ..

GST Council Meeting : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు 43వ వస్తు, సేవల పన్ను

GST Council Meeting : నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆర్థిక మంత్రి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ..
Gst Council Meeting
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: May 28, 2021 | 7:23 AM

Share

GST Council Meeting : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్టు ఆర్థికశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రాష్ట్రాలకు పరిహారం, వివిధ మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు వంటి కీలక అంశాలపై జిఎస్‌టి కౌన్సిల్ చర్చించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ద్విచక్ర వాహనాల కోసం జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఆక్సిజన్ పరోక్ష పన్ను రెట్లు తీసుకురావడం కూడా ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే సమాశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారు. చివరి 42 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం గత ఏడాది అక్టోబర్ 5 న జరిగింది. సమావేశంలో రాష్ట్రాలకు పరిహారాన్ని విడుదల చేయడం మరియు పన్ను చెల్లింపుదారులపై సమ్మతి భారాన్ని తగ్గించడానికి జిఎస్టి రిటర్న్ ఫైలింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయడం వంటి అనేక కీలక సిఫార్సులు చేయబడ్డాయి.

Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో

Fact Check: పసుపు, రాతి ఉప్పు, పటిక, ఆవ నూనెతో బ్లాక్ ఫంగస్ పారిపోతుందా?.. అసలు వాస్తవం ఏంటి..?

IMA Uttarakhand :డాక్టర్లు పై అలోపతి మందులపై తీవ్ర విమర్శలు చేసిన యోగ గురువు రాందేవ్ బాబా..అభ్యన్తరం తెలిపిన ఉత్తరాఖండ్ ఐయాంఏ