Greater Noida: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్
Greater Noida Expressway News: నోయిడా - గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్ పడింది. రోడ్డుపై ఒక్కసారిగా 15 అడుగుల పొడవు,
Noida Expressway: నోయిడా – గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్ పడింది. రోడ్డుపై ఒక్కసారిగా 15 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో భారీ సింక్‌హోల్ పడింది. వాహనదారుల కళ్లముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఒక్కసారిగా హతాశులయ్యారు. అలర్ట్ అయి తమ బండ్లకు బ్రేక్ కొట్టడంతో ప్రమాదం తప్పింది. కాగా, సింక్‌హోల్‌పై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా – గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక్కసారిగా భారీ సింక్ హోల్ పడింది. అండర్‌పాస్ కోసం పని జరుగుతున్న సెక్టార్ 96కి సమీపంలో రోడ్డు భాగం ధ్వంసమైంది. నోయిడా నుండి గ్రేటర్ నోయిడా వైపు వెళ్లే సమయంలో క్యారేజ్‌వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. దీని మరమ్మతు పనులు ఇప్పటికే చేపట్టారు అధికారులు. కాగా, రోడ్డుపై భారీ సింక్ హోల్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రస్తుతం అక్కడ అంతా క్లియర్ అయ్యిందని అధికారులు వల్లడించారు. కాగా, 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పై వారం రోజుల్లో లక్షలాది వాహనాలు ప్రయాణిస్తాయి. శని, ఆదివారాల్లో వాహనాల రద్దీ తగ్గుతుంది.
Noida-Greater Noida expressway pic.twitter.com/vBqgTatHMu
ఇవి కూడా చదవండి— Piyush Rai (@Benarasiyaa) August 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..