బంగారంపై వస్తున్న వార్తలపై నోరువిప్పిన కేంద్రం

బంగారంపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికార్లు కొడుతున్నాయి. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. పరిమితికి మించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు […]

బంగారంపై వస్తున్న వార్తలపై నోరువిప్పిన కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 4:43 PM

బంగారంపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికార్లు కొడుతున్నాయి. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. పరిమితికి మించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయబొతున్నారని.. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవాళ్లంతా దానిని బయటపెట్టి, అందుకు తగినంత పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రచారం జరిగుతోంది.

అయితే ఈ ప్రచారం దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ దీనిపై స్పందించింది. అసలు బంగారంపై  క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనంటూ సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి ఈ బంగారంపై నెలకొన్న టెన్షన్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగినట్లే. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పథకం పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.

Latest Articles
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ