వోడాఫోన్ వినియోగాదారులకు షాకింగ్ న్యూస్..! ఇక భారత్‌కు బైబై..!
ప్రముఖ భారత టెలికాం సంస్థ వోడాఫోన్.. త్వరలో వినియోగదారులకు షాకింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంస్థ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో.. ఇక భారత్‌లో సర్వీసులకు బైబై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ” వోడాఫోన్ సంస్థ.. ఇక ఎప్పుడో తన మూఠాముల్లె సర్దుకుని భారత్‌కు బైబై చెప్పి వెళ్లిపోవచ్చు” అంటూ ప్రచురించింది. ప్రస్తుతం సంస్థ తీవ్రమైన నష్టాల బాట పట్టడమే ఇందుకు కారణమంటూ పేర్కొంది. అంతేకాదు.. వోడాఫోన్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. దిగజారుతుండటం.. […]
ప్రముఖ భారత టెలికాం సంస్థ వోడాఫోన్.. త్వరలో వినియోగదారులకు షాకింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంస్థ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో.. ఇక భారత్‌లో సర్వీసులకు బైబై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ” వోడాఫోన్ సంస్థ.. ఇక ఎప్పుడో తన మూఠాముల్లె సర్దుకుని భారత్‌కు బైబై చెప్పి వెళ్లిపోవచ్చు” అంటూ ప్రచురించింది. ప్రస్తుతం సంస్థ తీవ్రమైన నష్టాల బాట పట్టడమే ఇందుకు కారణమంటూ పేర్కొంది. అంతేకాదు.. వోడాఫోన్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. దిగజారుతుండటం.. నిధుల సమీకరణకు అడ్డంకిగా మారిందని పేర్కొంది.
అయితే ఈ విషయంలో వోడాఫోన్ సంస్థ అధికారికంగా ఏలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు రూ. 4వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు వోడాఫోన్ ప్రకటించింది. కాగా, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1300 కోట్లు ఎక్కువ. మరో వైపు రుణ పునవ్యస్థికరణ చేయాలంటూ వోడాఫోన్ రుణదాతలను కోరినట్టు.. ఇటీవలే ఓ వార్త హల్‌చల్ చేసింది. అయితే అప్పట్లో వోడాఫోన్ ఆ వార్తలను కొట్టిపారేసింది. రుణ పునర్వవస్థీకరణ కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చెల్లింపులు చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే తాజాగా వస్తున్న వార్తలపై వోడాఫోన్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి కొద్ది రోజులు వేచి చూస్తే అసలు విషయం ఎంటో తెలుస్తుంది.