Independence day: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్.. దీని అర్థం ఏంటో తెలుసా.?
Independence day 2022: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను...
Independence day 2022: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకొని దేశ ప్రజలు తమ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేసి దేశ భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి మొదలు ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతిని ఉద్దేశించిన మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ దేశ ప్రజలకు డూడుల్ రూపంలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఆర్టిస్ట్ నీతి రూపొందించిన ఆర్ట్‌ను డూడుల్‌గా ప్రదర్శిస్తోంది. ఓ మహిళ పతంగులు తయారు చేస్తుండగా, చిన్నారులు వాటిని ఎగరవేస్తున్నట్లు్న్న యానిమేటెడ్ డూడుల్‌ను రూపొందించారు. స్వాతంత్రోద్య సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనకు గూగుల్ డూడుల్ ప్రతిబింభంగా నిలిచింది. 1927 నవంబర్ 8న సైమన్ కమిషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో.. కమిషన్ సభ్యులు దేశంలో అడుగుపెట్టిన రోజునే దేశమంతటా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే ప్రజలు నల్లజెండాలు, గాలిపటాలు ప్రదర్శించారు. వాటిపై సైమన్ గో బ్యాక్ అని రాసి గాలి పటాలను ఎగరేశారు.
ఇదిలా ఉంటే గూగుల్ డూడుల్‌ను రూపొందించిన కేరళ ఆర్టిస్ట్ నీతి ఈ విషయమై మాట్లాడుతూ.. ‘గాలి పటాల చుట్టూ ఉన్న భారత దేశ సంస్కృతిని ఈ గూగుల్ డూడుల్ రూపంలో నా ఆర్ట్ వర్క్ వర్ణిస్తుంది. ఆకాశమే హద్దుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మనం సాధించిన ఎన్నో ఘనతలను ఎగురుతున్న గాలిపటాలతో సూచించాను’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..