Republic Day Google Doodle: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా డూడుల్ తో గూగుల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
నేడు భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా గూగుల్ చక్కటి డూడుల్ తో రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపింది. భారత దేశం విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలకు..
Republic Day Google Doodle: నేడు భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా గూగుల్ చక్కటి డూడుల్ తో రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపింది. భారత దేశం విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలకు నెలవు.. రకరకాల కళలు, అనేక ఆచారాలు, బహుభాషల సమ్మేళనం.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న గుగూల్ జాతీయ జెండా రంగులను ప్రతిబించే విధంగా సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తూ.. డూడుల్ తయారు చేసింది.
ఇందులో ప్రధానంగా Googleలో రెండో Oను ఏనుగు అంబారీగా వేసి… సృజనాత్మకతను చాటుకుంది గూగుల్. అలాగే… రెండో G దగ్గర ఏనుగును ఓ వ్యక్తి వీడియో షూట్ చేస్తున్నట్లుగా ఆర్ట్ వేశారు. ఇక చివరి Eలో ఓ మహిళ తొంగి చూస్తున్నట్లు వేశారు. ఈ డూడుల్ భారత్ లోని నివసిస్తున్న అన్ని మతాల వారు, వివిధ రకాల ప్రజలు అందరూ ఉండేలా ఆర్ట్ వేశారు. దీంతో గూగుల్ రిపబ్లిక్ డే కి భారత్ విశిష్టతను చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ డూడుల్ లో మనం కళలు, కళాఖండాలు, సంస్కృతి, పల్లెలు అన్నింటినీ చూడవచ్చు. పాత చారిత్రక భవనాలు, అప్పటి ఆర్ట్ వర్క్ షోకేస్ చేసింది గూగుల్. అలాగే… కాషాయరంగును బ్యాక్‌డ్రాప్‌లో సెచ్ చేసింది. ప్రజల ముందు గ్రీన్ కలర్ వేసింది. కంపెనే పేరును మధ్యలో ఉంచింది.
Also Read: ఘనంగా గణతంత్ర దినోత్సవం.. తెలంగాణలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా