India Corona Cases: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు, మరణాల వివరాలు ఇలా..
భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా 10వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో..
Coronavirus Updates in India: భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా 10వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 9,102 కరోనా కేసులు నమోదు కాగా.. 117 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,76,838 కి చేరగా.. మరణాల సంఖ్య 1,53,587 కి పెరిగింది.
గత 24గంటల్లో కరోనా నుంచి 15,901 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,03,45,985 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,77,266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా సోమవారం దేశవ్యాప్తంగా 7,25,577 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి జనవరి 25 వరకు మొత్తం 19,30,62,694 నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.