Republic Day 2021: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. రాజ్‌పథ్‌లో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం..

Ravi Kiran

|

Updated on: Jan 26, 2021 | 11:16 AM

Republic Day 2021: యావత్ భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న ఈ గణతంత్ర దినోత్సవం..

Republic Day 2021: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. రాజ్‌పథ్‌లో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం..

Republic Day 2021: యావత్ భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న ఈ గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండానే తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగాయి. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖుల సమక్షంలో రాజ్‌పథ్‌లో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jan 2021 11:04 AM (IST)

    టి -90 భీష్మను అదేశిస్తున్న కెప్టెన్ కరణ్‌వీర్ సింగ్

    రాజ్‌పథ్‌లో టి-90 ట్యాంకుల విన్యాసాలు

  • 26 Jan 2021 11:00 AM (IST)

    రాజ్‌పధ్‌లోని రిపబ్లిక్ డే పరేడ్‌ విజువల్స్..

  • 26 Jan 2021 10:37 AM (IST)

    రాజ్‌పధ్‌లోని పరేడ్‌లో పరమ వీర చక్ర, అశోక్ చక్ర విన్నర్స్..

    రాజ్‌పధ్‌లోని పరేడ్‌లో పరమ వీర చక్ర, అశోక్ చక్ర విన్నర్స్ పాల్గొన్నారు.

  • 26 Jan 2021 10:24 AM (IST)

    రాజ్‌పథ్‌లో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖుల సమక్షంలో రాజ్‌పథ్‌లో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

  • 26 Jan 2021 10:23 AM (IST)

    ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా నాయకత్వం వహించారు

    పరేడ్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించారు.

  • 26 Jan 2021 10:19 AM (IST)

    రాజ్‌పాత్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

    నలబై ఆరు మంది సెక్యూరిటీ గార్డుల మధ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాజ్‌పాత్‌కు చేరుకున్నారు.

  • 26 Jan 2021 10:16 AM (IST)

    నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సెరిమోనియాల్ పుస్తకంపై సంతకం చేసిన పీఎం మోదీ

  • 26 Jan 2021 10:11 AM (IST)

    ఓం బిర్లా తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు.

  • 26 Jan 2021 10:11 AM (IST)

    బీహార్ సీఎం నితీష్ కుమార్ తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

  • 26 Jan 2021 10:10 AM (IST)

    మొబైల్ ఇంటర్నెట్ సేవలు కశ్మీర్ అంతటా తాత్కాలికంగా నిలుపుదల

    రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యగా కాశ్మీర్ లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

  • 26 Jan 2021 10:08 AM (IST)

    కోవిడ్ ప్రోటోకాల్స్ మధ్య గణతంత్ర దినోత్సవ వేడుకలు..

    ఢిల్లీలోని రాజ్‌పాత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు మధ్య ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.

  • 26 Jan 2021 10:05 AM (IST)

    బీజేపీ జాతీయ కార్యాలయంలో జెండా ఎగురవేసిన జేపీ నడ్డా

    బీజేపీ జాతీయ కార్యాలయంలో జెండా ఎగురవేసిన పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా

  • 26 Jan 2021 09:33 AM (IST)

    రాజకీయ ప్రముఖుల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

  • 26 Jan 2021 09:32 AM (IST)

    భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్..

    భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు. భారతప్రజలందరికీ అభినందనలు తెలిపిన ఆయన.. కరోనా వైరస్ మహమ్మారిని మానవాళి నుంచి దూరం చేసేందుకు యూకే – భారతదేశం సమన్వయం పనిచేయాలని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్ సహకారంలో భారతదేశం యూకే కలిసి పనిచేస్తున్నాయని బోరిస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  • 26 Jan 2021 09:20 AM (IST)

    తొలి మహిళా ఫైటర్ పైలట్ లెఫ్ట్నంత్ భావన కాంత్

    ఆర్-డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ లెఫ్ట్నంత్ భావన కాంత్

  • 26 Jan 2021 09:16 AM (IST)

    చీఫ్ గెస్ట్ లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు

    కరోనా కారణంగా ఈ ఏడాది చీఫ్ గెస్ట్ లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. గడిచిన 50 ఏళ్లలో ఇదే తొలిసారి.

  • 26 Jan 2021 09:12 AM (IST)

    రాజస్థాన్‌లో గణతంత్ర దినోత్సవం వేడుకలు..

    రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్‌లోని సీఎం నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు.

  • 26 Jan 2021 08:59 AM (IST)

    రిపబ్లిక్ డే పరేడ్‌కు ఏర్పాట్లు పూర్తి..

    ఢిల్లీలోని రాజ్‌పాత్‌లో రిపబ్లిక్ డే పరేడ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు.

  • 26 Jan 2021 08:57 AM (IST)

    భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మోదీ ట్వీట్..

    72వ గణతంత్ర దినోత్సవంతో భారతావని పులకించిపోతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు.

  • 26 Jan 2021 08:47 AM (IST)

    గణతంత్ర దినోత్సవ వేడుకలు.. దేశ రాజధానిలో పటిష్ట భద్రత..

    యావత్ భారతావని 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు చేపట్టింది.

Published On - Jan 26,2021 11:09 AM

Follow us