భారత గణ తంత్ర దినోత్సవం నాడు ఆకర్షణగా నిలిచిన ప్రధాని మోదీ టర్బన్, ఎవరిచ్చిన గిఫ్ట్ ?

భారత గణ తంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఈ స్పెషల్ టర్బన్ ని గుజరాత్ లోని..

భారత గణ తంత్ర దినోత్సవం నాడు ఆకర్షణగా నిలిచిన  ప్రధాని మోదీ టర్బన్, ఎవరిచ్చిన గిఫ్ట్ ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 26, 2021 | 12:20 PM

భారత గణ తంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఈ స్పెషల్ టర్బన్ ని గుజరాత్ లోని జామ్ నగర్ కి చెందిన రాయల్ ఫ్యామిలీ గిఫ్ట్ గా ఇచ్చిందట.. ఈ  కలర్ ఫుల్ తలపాగాను గుజరాతీలో ‘పగ్డీ’ గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను. ఆ తరువాత కూడా మోదీ ఈ తలపాగాను ధరించే ఉన్నారు. హలారీ పగ్డీగా ప్రచారంలో ఉన్న  ఈ తలపాగాను జామ్ నగర్ రాయల్ ఫ్యామిలీ ప్రత్యేకంగా మోదీ కోసం రూపొందించింది. గత ఏడాది రిపబ్లిక్ డే నాడు మోదీకాషాయ రంగు టర్బన్ ధరించి కనిపిస్తే ఈ సారి  ఇలా కనిపించడం విశేషం. దేశానికి సంబంధించిన ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ ఆయన ఇలా  స్పెషల్ గా కనిపించడం ఆనవాయితీగా మారుతోంది.