Goa Lockdown: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..!

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశంలోని అనేక రాష్ట్రాలు పాక్షికంగానో, పూర్తిస్థాయిలోనే లాక్‌డౌన్‌లు విధించడం మొదలుపెడుతున్నాయి. ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా లాక్‌డౌన్ బాటపడుతున్నాయి.

Goa Lockdown: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..!
delhi lockdown news
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 28, 2021 | 2:57 PM

Goa state Fully Lockdown: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశంలోని అనేక రాష్ట్రాలు పాక్షికంగానో, పూర్తిస్థాయిలోనే లాక్‌డౌన్‌లు విధించడం మొదలుపెడుతున్నాయి. ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా లాక్‌డౌన్ బాటపడుతున్నాయి. తాజాగా గోవా రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఉధృతి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 29 రాత్రి 7 గంటల నుంచి మే 3 ఉదయం వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తసుకున్నట్లు గోవా ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని పేర్కొంది. అత్యవసర సర్వీసులకు లాక్‌డౌన్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని గోవా సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా అత్యవ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా కోసం రాష్ట్ర స‌రిహ‌ద్దులు తెరిచే ఉంటాయ‌ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. కానీ, ప్రజార‌వాణా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యాషినోలు, హోట‌ళ్లు, ప‌బ్‌లు కూడా పూర్తిగా మూసే ఉంటాయ‌ని తెలిపారు.

Read Also…  మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం