AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azad: పక్కా వ్యూహంతో అడుగు వేస్తున్న గులాం నబీ ఆజాద్.. మద్ధతు దారులతో జమ్ము కశ్మీర్‌లో భారీ ర్యాలీకి ప్లాన్

పార్టీ పెట్టబోయే అంశం మీద తన మద్ధతు దారులతో చర్చించనున్నారు. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వల్లే..

Ghulam Nabi Azad: పక్కా వ్యూహంతో అడుగు వేస్తున్న గులాం నబీ ఆజాద్.. మద్ధతు దారులతో జమ్ము కశ్మీర్‌లో భారీ ర్యాలీకి ప్లాన్
Ghulam Nabi Azad
Sanjay Kasula
|

Updated on: Sep 04, 2022 | 11:45 AM

Share

కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత పక్క ప్లాన్‌తో ముందుకు దూసుకుపోతున్నారు గులామ్‌ నబీ ఆజాద్‌(Ghulam Nabi Azad). తాజాగా ఆయన తన సొంత రాష్ట్రమైన జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పార్టీ పెట్టబోయే అంశం మీద తన మద్ధతు దారులతో చర్చించనున్నారు. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వల్లే నష్టపోతోందనీ.. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ నాశనమైందని.. ఆయన లీడర్ గా ఏ మాత్రం సరిపోరనీ వ్యాఖ్యానించి మరీ బయటకు వచ్చేశారు ఆజాద్. గులాం నబీ ఆజాద్ ప్రభావం కశ్మీరీ కాంగ్రెస్ మీద భారీగానే పడింది.. మాజీ పీసీసీ చీఫ్ మహ్మద్ సయ్యద్ వంటి వారితో పాటు 64 మంది కాంగ్రెస్ లీడర్లు ఒక్కసారిగా పార్టీని వదిలి బయటకొచ్చేశారు. దీంతో కశ్మీర్ లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయినంత పరిస్థితి.. ఈ సిట్యువేషన్లో ఆజాద్ కశ్మీర్ వెళ్లి.. అక్కడ తన సపోర్టర్స్ తో పార్టీ పెట్టబోయే విషయం మీద డిస్కస్ చేయనున్నారు.

అయితే ఆజాద్ మీద బీజేపీ- బీ టీమ్ అన్నవిమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో.. క్లారిటీ ఇచ్చారు ఆజాద్. తాను కాంగ్రెస్ నుంచి బయట పడ్డా.. తన మూల సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పుల్లేవనీ. తాను ఎప్పటికీ లౌకిక వాదినే అని అన్నారాయన. పేరు మారుతుందేమోగానీ రక్తం మాత్రం మారదని కామెంట్ చేశారు ఆజాద్.

ఇదే సమయంలో పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుందనీ. ఎందుకంటే అందుకు తగ్గ వనరులసు సమకూర్చుకోవడానికి భారీ కసరత్తే అవసరమవుతుందని ముందే చెప్పారు ఆజాద్. అయితే కశ్మీర్ లో ఎన్నికలొస్తే.. ఆ ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. ఒక వేళ తామ పార్టీ పెడితే.. కశ్మీర్ ను తిరిగి ఏకం చేస్తామనీ. కశ్మీర్ ప్రత్యేక హోదా తమ మేనిఫెస్టోలో ఒక భాగమని అన్నారు ఆజాద్ మద్ధతుదారులు.

గులాం నబీ ఆజాద్ ది సుమారు యాభై ఏళ్ల రాజకీయ జీవితం. 1973లో భలేస్సా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఆజాద్. తర్వాత దశల వారీగా ఎదిగి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆజాద్ మహారాష్ట్రలోని వాశిమ్ నియోజక వర్గం నుంచి తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధించారు.

తర్వాత 1982లో కేంద్ర మంత్రి వర్గంలో చట్టం, న్యాయం, కంపెనీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయ్యారు. అంచలంచెలుగా పార్టీలో ఎదిగిన ఆజాద్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినపుడలల్లా.. కీలక మంత్రి పదవులను చేపట్టారు.

ఇక ముఖ్యమంత్రిగా ఆజాద్ ప్రస్థానం చూస్తే.. ఆయన 2005లో కశ్మీర్ సీఎంగా పని చేశారు. 2008లో ఆజాద్ ప్రభుత్వం ఒక హిందూ దేవాలయానికి భూమిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో ముస్లిములు వ్యతిరేకించడంతో.. ఆ ప్రక్రియ నిలిపి వేసింది ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందువులు చేపట్టిన ఆందోళనలో ఏడుగురు చనిపోయారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014- 19 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పని చేసిన ఆజాద్ ప్రస్తుతం ఐదో సారి రాజ్యసభ ఎంపీగా సేవలందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం