రోడ్డుపై వెళ్తుండగా ఎదురొచ్చిన అనుకోని అతిథి.. ప్రాణం కోసం భీకర పోరాటం.. చివరకు
చిరుత.. ఈ పేరు చెబితేనే భయంతో వణికిపోతాం. జూ లో చూసినా నక్కినక్కి చూస్తాం. అలాంటిది రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆకస్మాత్తుగా కనిపిస్తే. ఒక్క ఉదుటున వచ్చి మనపై జంప్ చేస్తే. ఊహించుకుంటుంటేనే వెన్నులో...
చిరుత.. ఈ పేరు చెబితేనే భయంతో వణికిపోతాం. జూ లో చూసినా నక్కినక్కి చూస్తాం. అలాంటిది రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆకస్మాత్తుగా కనిపిస్తే. ఒక్క ఉదుటున వచ్చి మనపై జంప్ చేస్తే. ఊహించుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ. కేరళలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ చిరుత ఓ వ్యక్తి పై చిరుత దాడి చేసింది. ఊహించని ఘటనతో భయపడిపోయిన ఆ వ్యక్తి.. కొడవలితో గొంతు కోసి హతమార్చాడు. కాగా.. ఈ చిరుతను అధికారులు పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమించడం గమనార్హం. కేరళలోని ఇడుక్కి జిల్లాలో గోపాలన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. తన ఇంటి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇంటి కాంపౌండ్ సమీపంలో రోడ్డుపై చిరుత కనిపించింది. గోపాలన్ ను చూసిన చిరుత వెంటనే అతనిపై దాడికి దిగింది. ఈ హఠాత్పరిణామానికి భయంతో వణికిపోయిన గోపాలన్ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని చిరుతతో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. తన వద్ద ఉన్న కొడవలిని తీసుకుని వన్య మృగాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కొన్ని క్షణాల పాటు భీకర యుద్ధమే జరిగింది. ఈ పెనుగులాటలో చిరుత మెడకు కొడవలి బలంగా దిగింది. తీవ్ర రక్తస్రావంతో చిరుత అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనలో గోపాలన్ కూ తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం ఉన్నతాధికారుల వద్దరు చేరింది. సాధారణంగా వన్యప్రాణులను చంపడం చట్ట ప్రకారం నేరం. వాటిని వేటాడడం, హతమార్చడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అయితే గోపాలన్.. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినందున అతనిపై చట్ట పరమైన చర్యలు ఉండవని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శశీంద్రన్ ప్రకటించారు.
అయితే.. గోపాలన్ పై దాడి చేసిన చిరుత గత కొన్ని రోజులగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫిఫ్టీ మైల్స్ అనే ప్రాంతంలో సంచరించి, రెండు మేకలను చంపేసింది. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చిరుతను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. కెమెరాలో చిరుత సంచరించిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి. దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గోపాలన్పై దాడి చేసింది. ఈ ఘటనలో గోపాలన్ చేతిలో చనిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..