Maha Kumbh: కుంభమేళా నిర్వహణ.. మేనేజ్‌మెంట్ పాఠమే కాదు.. దేశ నాయకత్వానికి ప్రతీక
కుంభమేళా నిర్వహణ వ్యవస్థకు సంబంధించి మేనేజ్‌మెంట్ కేస్ స్టడీపై ఇటీవల హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం చేసింది. దానికి అయ్యే ఖర్చు, వచ్చే రాబడి లాంటి లాజిస్టిక్స్‌ను చూసి ఆశ్చర్యపోయిందని అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఓ భారతీయుడిగా తాను మహాకుంభమేళా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. మహా కుంభమేళా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ వేడుకలో సామాన్యులతో పాటు దేశవిదేశాల నుంచి పలువురు వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. అందులో ఒకరు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒకరు. ఆయన తన కుటుంబతో కలిసి ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. మహాకుంభమేళా లాంటి ఓ ప్రకృతి దృశ్యకావ్యం.. దేనితోనూ సరితూగదని.. తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఎన్నో ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధన నెట్‌వర్క్‌లను నిర్మించిన వ్యక్తిగా చెబుతున్నా.. ఈ మహాకుంభమేళాలోని ఆధ్యాత్మిక మౌలిక సదుపాయాలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని.. కుంభమేళా నిర్వహణ వ్యవస్థ అనేది మేనేజ్‌మెంట్ పాఠం అని లింక్దిన్ బ్లాగ్‌లో ఓ సుదీర్ఘ కథనాన్ని రాసుకొచ్చారు అదానీ.
ప్రపంచంలోనే అతిపెద్ద మేనేజ్‌మెంట్ కేస్ స్టడీ..
కుంభమేళా నిర్వహణ వ్యవస్థకు సంబంధించి మేనేజ్‌మెంట్ కేస్ స్టడీపై ఇటీవల హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం చేసింది. దానికి అయ్యే ఖర్చు, వచ్చే రాబడి లాంటి లాజిస్టిక్స్‌ను చూసి ఆశ్చర్యపోయిందని అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఓ భారతీయుడిగా తాను మహాకుంభమేళా నుంచి మరేదో నేర్చుకున్నానని.. కుంభమేళా నిర్వహణ వ్యవస్థ లెక్కలను మాత్రమే సూచించదని.. ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుందన్నారు. ఇందుకే ప్రతీ 12 ఏళ్లకు ఓసారి న్యూయార్క్ కంటే పెద్దదైన నగరం.. గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద ఒకటై.. దైవభక్తులతో మహా ఆధ్యాత్మిక నగరంగా మారుతుందని గౌతమ్ అదానీ తెలిపారు.
కుంభమేళా నిర్వహణ వ్యవస్థకు మూల స్తంభాలు ఇవే..
1. ఆధ్యాత్మికత..
మహా నదుల సంగమం దగ్గర ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మిలియన్ల మంది ప్రజలు అంకితభావంతో, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైనప్పుడు.. అది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. ఆత్మల అపూర్వ సంగమం అని చెప్పొచ్చు. దీనినే నేను “స్పిరిచువల్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్” అని పిలుస్తాను. అది ఎంత పెద్దదిగా పెరుగుతుందో, అంతే పెద్దదిగా మానవత్వం పరంగా కూడా మరింత సమర్థవంతంగా మారుతుంది.
2. స్థిరత్వం..
ఒక నది కేవలం నీటి వనరు మాత్రమే కాదు, జీవన ప్రవాహం. దానిని సంరక్షించడం మన పురాతన జ్ఞానానికి నిదర్శనం. లక్షలాది మందికి ఆతిథ్యం ఇచ్చే అదే నది కుంభ్ తర్వాత దాని సహజస్థితికి తిరిగి వస్తుంది. వందల మిలియన్ల మంది భక్తులను శుద్ధి చేసిన ఆ నది.. దానిలో ఉన్న “మలినాలను” తొలగించుకోగలదనే నమ్మకం అందరిలోనూ ఉంది.
3. సేవ ద్వారా నాయకత్వం..
నిజమైన నాయకత్వం అనేది ఆదేశాలు ఇవ్వడంలో కాదు.. అందరినీ వెంట తీసుకెళ్లే సామర్థ్యంలో ఉంటుంది. మతపరమైన ఆదేశాల మేరకు స్థానిక అధికారులు, వాలంటీర్లు సామరస్యంగా పని చేస్తారు. ఈ పరిస్థితి గొప్ప నాయకులు ఎలా ఉంటారో చెబుతుంది. గొప్ప నాయకులు ఎవ్వరూ కూడా కమాండ్ చెయ్యరు.. వారు ఇతరులు కలిసి పని చేయడానికి, సమిష్టిగా ఎదగడానికి పరిస్థితులను సృష్టిస్తారు.
ప్రపంచ వ్యాపారాలకు కుంభమేళా ఏం నేర్పిస్తుంది..
కుంభమేళా ద్వారా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
1. సమగ్ర వృద్ధి
సాధువుల నుంచి CEOల వరకు.. గ్రామస్తుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరినీ ఈ కుంభమేళా స్వాగతిస్తుంది. దీనినే అదానీ ‘గ్రోత్ ఆఫ్ గుడ్‌నెస్’ అని పిలిచారు.
2. ఆధ్యాత్మిక సాంకేతికత
డిజిటల్ ఆవిష్కరణల పట్ల మనం ఎలా గర్విస్తున్నామో.. అలాగే కుంభ్ ఆధ్యాత్మిక సాంకేతికతను ప్రదర్శిస్తుంది. మానసిక అనారోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ఉన్న యుగంలో.. ఈ ఆధ్యాత్మిక మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనవి.
3. సాంస్కృతిక విశ్వాసం
ప్రపంచ సజాతీయీకరణ యుగంలో, కుంభ్ సాంస్కృతిక ప్రామాణికతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మ్యూజియం కాదని.. ఆధునికతకు అనుగుణంగా సంప్రదాయానికి సజీవ ఉదాహరణ అని అంటున్నారు.
భవిష్యత్తు పురాతనమా?
నేను మా ఓడరేవులు లేదా సౌర క్షేత్రాల గుండా నడుస్తున్నప్పుడు, నేను తరచుగా కుంభ్ నేర్పిన పాఠాలను ధ్యానిస్తాను. మన ప్రాచీన నాగరికత కేవలం స్మారక చిహ్నాలను నిర్మించలేదు. లక్షలాది మందికి మనుగడ సాగించే జీవన వ్యవస్థలను సృష్టించింది. ఆధునిక భారతదేశంలో మనం కోరుకునేది ఇదే – మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాదు, పర్యావరణ వ్యవస్థలను పెంపొందించడం కూడా ముఖ్యమే.
నాయకత్వ సవాళ్లు..
ఆధునిక నాయకులకు, కుంభ్ ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది: మనం సంవత్సరాలు మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఉండే సంస్థలను నిర్మించగలమా? మరి మన వ్యవస్థలు ఆర్ధిక స్కేల్‌ను మాత్రమే కాకుండా లోతైన ఆత్మను కూడా పెంపొందించగలవా..? AI, వాతావరణ సంక్షోభం, సామాజిక విచ్ఛిన్నత యుగంలో, కుంభ్ పాఠాలు గతంలో కంటే చాలా సందర్భోచితంగా ఉన్నాయి.
– స్థిరమైన వనరుల నిర్వహణ
– సామరస్యపూర్వకమైన సామూహిక సహకారం
– మానవ స్పర్శతో కూడిన సాంకేతికత
– సేవ ద్వారా నాయకత్వం
కాగా, ఇటీవల అదానీ కుటుంబం మహాకుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో అదానీ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న ఇస్కాన్ ఏర్పాటు చేసిన శిబిరంలో గౌతమ్ అదానీ భోజన తయారు చేసి.. భక్తులకు స్వయంగా వడ్డించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లక్షలాది మంది తరలివచ్చే కుంభమేళా నిర్వహణ వ్యవస్థ అనేది మేనేజ్‌మెంట్ పాఠం అని స్పష్టం చేశారు.