AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh: మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..

 ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహాకుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన అమిత్‌ షాకు యూపీ సీఎం యోగి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏడుగురు సాధువులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇందులో భాగంగా ఆచమనం చేసి, తర్పణం అర్పించారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి, యోగా గురు రామ్‌దేవ్‌, పలువురు ప్రముఖ సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Maha Kumbh: మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..
Amit Shah Visits Maha Kumbh
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2025 | 3:59 PM

Share

మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణ్య స్నానమాచరించారు.  పవిత్ర స్నానం చేసిన అమిత్‌ షాకు సాధు ప్రముఖలు తిలకం దిద్దారు. ఆయనతోపాటు ఆయన చిన్నారి మనవడికి కూడా సాధు సంతువులు తిలకం దిద్దారు. ICC చీఫ్‌ జై షా కుమారుడు ఈ ప్రోగ్రామ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని సాధువులు ఆశీర్వదించారు.

అమిత్‌ షా, తన సతీమణి సోనాల్‌ షా, కుమారుడు జై షా, తన చిన్నారి మనవడు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి త్రివేణి సంగమ ఘాట్‌ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది.  ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్‌ షా అర్చన చేశారు. గంగామాతకు హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు అమిత్‌ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ.  ఈ 45 రోజుల్లో ఏ రోజున అయినా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్‌ రాజ్‌కు పోటెత్తుతున్నారు. ఈ నెల 29న మహాకుంభమేళలో అద్వీతియమైన రోజు. బుధవారం మాఘ మాస మౌని అమావాస్య మహిమాన్వితమని చెప్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..