Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Robbery: ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొట్టే ముఠా.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం నుంచి డబ్బులు దోచుకెళ్తున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. రెండు రోజుల క్రితమే ఆ ముఠా సభ్యులను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపుర్ విమానశ్రయంలో కాపుకాసి మరి నిందితులను పట్టుకున్నారు. అయితే వీరు రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాకు చెందినటువంటి డీగ్ అనే ప్రాంతానికి చెందినట్లు గుర్తించారు. నిందితులు జుబేర్‌(32), లుక్మాన్‌ డీన్‌(37), సద్దాం(35), ముస్తాక్‌(28), ఇద్రిస్‌(29)గా గుర్తించారు.

ATM Robbery: ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొట్టే ముఠా.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Thieves
Follow us
Aravind B

|

Updated on: Sep 07, 2023 | 1:41 PM

తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం నుంచి డబ్బులు దోచుకెళ్తున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. రెండు రోజుల క్రితమే ఆ ముఠా సభ్యులను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపుర్ విమానశ్రయంలో కాపుకాసి మరి నిందితులను పట్టుకున్నారు. అయితే వీరు రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాకు చెందినటువంటి డీగ్ అనే ప్రాంతానికి చెందినట్లు గుర్తించారు. నిందితులు జుబేర్‌(32), లుక్మాన్‌ డీన్‌(37), సద్దాం(35), ముస్తాక్‌(28), ఇద్రిస్‌(29)గా గుర్తించారు. అయితే ఈ ముఠా గత ఏడు సంవత్సరాల నుంచి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి కోట్ల రూపాయలకు కొలగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణలోని భద్రాద్రి అర్బన్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఏటీఎంలో డబ్బు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేవాఠ్ గ్యాంగ్ అని పిలిచే ఈ ముఠాలో 100 వరకు మోసగాళ్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్, అల్వార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డులను తీసుకొని పది రోజులకొకసారి వారు ఎంచుకున్నటువంటి వివిధ రాష్ట్రాలకు విమానాల్లో వెళ్తారు. అయితే పోలీసులకు మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా సూటూబూటూ వేషధారణ వేసుకొని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏటీఎంలను టార్గెట్ చేస్తారు. ఇద్దరి చొప్పున ఒక జట్టుగా ఏర్పడతారు. అందులో ఒకరు ఏటీఎం లోపల ఉంటారు. మరొకరు ఆ ఏటీఎంకు విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతంలో ఉంటారు. అయితే ఆ ఏటీఎం యంత్రం నుంచి డబ్బులు తీసుకునే చివరి క్షణం దాకా ఏటీఎంలో విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల యంత్రంలో నుంచి డబ్బు బయటకి వస్తుంది.. అంతేగానీ ఖాతాదారుడి ఖాతాలో మాత్రం ఎటువంటి ఉపసంహరణ అనేది జరగదు.

ఇవి కూడా చదవండి

ఇక ఆ ఏటీఎం నుంచి దోచుకున్నటువంటి సొమ్మును ముఠా సభ్యులు.. ఏటీఎం కార్డుదారులు సగం వాటాగా పంచుకుంటారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అయితే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో రాజస్థాన్ బయలుదేరారని అక్కడి పోలీసులు సమాచారం అందుకున్నారు. ఇక జైపూర్ విమానశ్రయంలో వల పన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి దాదాపు 75 ఏటీఎం కార్డులను.. అలాగే 2 లక్షల 31 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా ఏటీఎంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటీఎంలో ఉండే డబ్బును దోచుకునేందుకు కొంతమంది కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి ఏటీఎం దొంగతనాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. ఏటీఎంల వద్ద మరింత భద్రత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.