లోకాన్ని విడిచిన గురువాయుర్ పద్మనాభన్.. ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు

కేరళలో విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలోని గురువయూర్ ఆలయంలో.. గత 66 ఏళ్లుగా ఆలయంలో సేవలందిస్తున్న ఏనుగు గజరత్నం.. ఈ లోకాన్ని విడిచివెల్లింది. ఈ ఏనుగు పేరు గురువయూర్ ప్రద్మనాభన్. 84 ఏళ్ల వయస్సు గల ఈ ఏనుగు.. చాలా రోజుల నుంచి గురువయూర్ శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ వస్తోంది. ఒట్టప్పలం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి 1954లో ఈ ఏనుగును ఆలయానికి అందజేశారు. అయితే అప్పటి నుంచి ఈ గజరత్నం.. ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను […]

లోకాన్ని విడిచిన గురువాయుర్ పద్మనాభన్.. ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 1:26 AM

కేరళలో విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలోని గురువయూర్ ఆలయంలో.. గత 66 ఏళ్లుగా ఆలయంలో సేవలందిస్తున్న ఏనుగు గజరత్నం.. ఈ లోకాన్ని విడిచివెల్లింది. ఈ ఏనుగు పేరు గురువయూర్ ప్రద్మనాభన్. 84 ఏళ్ల వయస్సు గల ఈ ఏనుగు.. చాలా రోజుల నుంచి గురువయూర్ శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ వస్తోంది. ఒట్టప్పలం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి 1954లో ఈ ఏనుగును ఆలయానికి అందజేశారు. అయితే అప్పటి నుంచి ఈ గజరత్నం.. ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ వస్తోంది. బుధవారం నాడు తీవ్ర అనారోగ్య కారణాలతో ఈ లోకాన్ని విడిచిపోయింది.

2007 జనవరి 1 నుంచీ… పద్మనాభన్‌కు ఆనారోగ్యానికి గురవ్వడంతో.. అప్పటి నుంచి ఇతర సేవలను అప్పగించలేదు. కొద్ది రోజుల తర్వాత 2011 అక్టోబర్‌.. మళ్లీ వడక్కన్‌చెర్రీ దేశంకి వచ్చింది. గురువాయుర్ ఏకాదశి నాడు.. కేశవ స్వామికి ఈ గజరత్నమే పూలమాల వేసేది. ఇప్పుడు ఈ గజరత్నం లేదన్న విషయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గజరత్నానికి సంప్రదాయ పద్దతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.