Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు. చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ […]

Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 11:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు.

చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ ఓ కాలువలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా దేశరాజధానిలో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. ఈ ఘటనలో ఆప్ నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంకిత్ శర్మ హత్య కేసులో.. తాహిర్ హుస్సేన్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఐపీసీ 302 కింద (హత్యకేసు)గా దయాల్ పూర్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. అధికారులు తొలుత రాళ్లదాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావించినా.. అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు మాత్రం.. ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌ సహా.. మరికొందరు శర్మను హతమార్చారని ఆరోపించారు. మరోవైపు ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని.. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.

మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాహీర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంకిత్ శర్మ హత్య కేసులో ఆరోపణలు రావడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం కేంద్రాలుగా మారినట్లు పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది మంది ఆందోళనకారులు..పెట్రోల్, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలను సేకరించారు.

పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?