విషాదం.. ముగ్గురు చిన్నారులను చిదిమేసిన గోడ..
హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. అఫ్జల్ సాగర్‌లోని మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరి చిన్నారులకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పునాదులు లేకుండా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల […]

హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. అఫ్జల్ సాగర్‌లోని మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరి చిన్నారులకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పునాదులు లేకుండా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల చిన్నారి పావనిగా గుర్తించారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.



